మోదీజీ నన్ను కూడా అరెస్ట్ చేయండి -రాహుల్

భారతీయులకు టీకాలు అందించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం, విదేశాలకు ఎలా పంపుతోందంటూ పోస్టర్లు వేసినందుకు ఏకంగా 17మంది అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న వేళ, ట్విట్టర్ లో రాహుల్ గాంధీ, ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. నేను కూడా ట్విట్టర్ లో ఆ పోస్టర్లు పెడుతున్నా, నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ పోస్టింగ్ పెట్టారు. ముఝే భీ గిరఫ్తార్ కరో అంటూ ఆ పోస్టింగ్ లో పేర్కొన్నారు. “మోదీజీ, […]

Advertisement
Update:2021-05-16 13:24 IST

భారతీయులకు టీకాలు అందించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం, విదేశాలకు ఎలా పంపుతోందంటూ పోస్టర్లు వేసినందుకు ఏకంగా 17మంది అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న వేళ, ట్విట్టర్ లో రాహుల్ గాంధీ, ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. నేను కూడా ట్విట్టర్ లో ఆ పోస్టర్లు పెడుతున్నా, నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ పోస్టింగ్ పెట్టారు. ముఝే భీ గిరఫ్తార్ కరో అంటూ ఆ పోస్టింగ్ లో పేర్కొన్నారు.

“మోదీజీ, హమారే బచ్చోంకే వ్యాక్సిన్ విదేశ్ క్యోం భేజ్ దియా” అంటూ హిందీలో రాసి ఉన్న పోస్టర్లు ఇటీవల ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చాయి. నల్ల రంగు పేపర్ పై తెల్ల అక్షరాలతో రాసి ఉన్నట్టు.. ఆ వాల్ పోస్టర్లను డిజైన్ చేసి తమ అసంతృప్తిని చాటి చెప్పారు కొంతమంది. దీంతో కేంద్రం సీరియస్ అయింది. మోదీని విమర్శించిన వారిపై 21 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి, 17మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని నాలుగు డివిజన్లలో ఈ అరెస్టులు జరిగాయి. మరిన్ని ఫిర్యాదులు వస్తే మరిన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరి ప్రోత్సాహంతో ఈ పోస్టర్లు వేశారో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

అటు మణిపూర్ లో ఇద్దరు అరెస్ట్..
మణిపూర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సఖోమ్ తికేంద్ర సింగ్ కరోనాతో మరణించడంపై పోస్ట్ లు పెట్టిన ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జర్నలిస్టు కిశోర్‌చంద్ర వాంఖెమ్‌, రాజకీయ కార్యకర్త ఎరెండ్రో లైచెంబామ్‌ ను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు. తికేంద్ర మరణంపై స్పందిస్తూ.. ఆవుపేడ, గోమూత్రం పనిచేయలేదా అంటూ వారు పోస్టులు పెట్టారు. అటు గంగా నదిలో శవాలు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై కూడా కేంద్రం సీరియస్ అయింది. గంగా నదిలో తేలియాడుతున్న మృతదేహాలతో కూడిన పాత ఫొటోను పోస్ట్ చేసి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారంటూ మాజీ ఐఏఎస్‌ అధికారిపై ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 2014లో ఉన్నావ్ లో తీసిన ఫొటోను తాజాగా జరిగిన ఘటనగా అభివర్ణించారని ఆయనపై అభియోగాలు మోపారు. ఈ అరెస్ట్ లతో ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ఇలా అమాయకుల్ని అరెస్ట్ చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు.

Tags:    
Advertisement

Similar News