మూవీ రివ్యూ: బట్టల రామస్వామి బయోపిక్కు
మూవీ రివ్యూ: బట్టల రామస్వామి బయోపిక్కు నటీనటులు: అల్తాఫ్ హసన్, శాంతిరావు, సాత్విక, లావణ్య రెడ్డి, భద్రం తదితరులు కథ-సంగీతం-దర్శకత్వం: రామ్ నారాయణ్ నిర్మాత: సతీష్ కుమార్, మ్యాంగో రామ్ స్ట్రీమింగ్: జీ5 రేటింగ్: 1.5/5 ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఓటీటీని దృష్టిలో పెట్టుకొని కొన్ని సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే అలా తెరకెక్కుతున్న సినిమాలు కనీసం షార్ట్ ఫిలిం స్థాయిలో కూడా ఉండకపోవడం బాధాకరం. కంటెంట్ చూడకుండా అలాంటి సినిమాల్ని ఓటీటీలు ఎలా కొంటున్నాయో.. […]
మూవీ రివ్యూ: బట్టల రామస్వామి బయోపిక్కు
నటీనటులు: అల్తాఫ్ హసన్, శాంతిరావు, సాత్విక, లావణ్య రెడ్డి, భద్రం తదితరులు
కథ-సంగీతం-దర్శకత్వం: రామ్ నారాయణ్
నిర్మాత: సతీష్ కుమార్, మ్యాంగో రామ్
స్ట్రీమింగ్: జీ5
రేటింగ్: 1.5/5
ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో కేవలం ఓటీటీని దృష్టిలో పెట్టుకొని కొన్ని సినిమాల్ని
తెరకెక్కిస్తున్నారు. అయితే అలా తెరకెక్కుతున్న సినిమాలు కనీసం షార్ట్ ఫిలిం స్థాయిలో కూడా
ఉండకపోవడం బాధాకరం. కంటెంట్ చూడకుండా అలాంటి సినిమాల్ని ఓటీటీలు ఎలా కొంటున్నాయో..
ఇది మరీ బాధాకరం. తాజాగా స్ట్రీమింగ్ కొచ్చిన బట్టల రామస్వామి బయోపిక్కు అనే సినిమా కూడా ఈ
కోవకు చెందిందే. జీ5లో స్ట్రీమింగ్ కొచ్చిన ఈ సినిమా ఎంత నాసిరకంగా ఉందంటే… ఇదొకటి ఉందనే
విషయాన్ని పూర్తిగా మరిచిపోవచ్చు.
కామెడీ గ్యారెంటీ అంటూ ప్రచారం చేసిన ఈ సినిమాలో ఆ ఛాయలు మచ్చుకు కూడా కనిపించవు. ఏదో
అక్కడక్కడ కొన్ని సీన్లు పేలిన సందర్భాలు తప్ప, మిగతా సినిమా మొత్తం కథ చుట్టూ తిరుగుతుంది. పోనీ ఆ కథైనా కొత్తగా ఉందా అంటే అది కూడా లేదు. అప్పుడెప్పుడో 30 ఏళ్ల కిందటొచ్చిన లేడీస్ టైలర్ లాంటి కథల్ని ఇటుఇటు మార్చి రాసుకున్నట్టుంది. బాధాకరమైన విషయం ఏంటంటే.. మేకింగ్ కూడా ఆ
కాలంలోనే తీసినట్టు అనిపిస్తుంది. కామెడీ లేకపోయినా కనీసం కాలక్షేపం కోసం చూద్దామన్నా, ఎలాంటి
ప్రొడక్షన్ వాల్యూస్ లేకుండా విసిగిస్తాడు ఈ రామస్వామి.
ఇప్పుడు కథలోకి వెళ్దాం. తండ్రి చనిపోతే ఆయన శవాన్ని తీసుకెళ్తూ, దారిలో ఓ అమ్మాయిని చూసి మనసు పడతాడు హీరో రామస్వామి. కిందామీద పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. రాముడి భక్తుడైన మన హీరో ఏకపత్నీవ్రతుడిగా ఉండాలనుకుంటాడు. కానీ విధి వక్రిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు.. మూడూ పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది. అలా ముగ్గురు భార్యలతో రామస్వామి కాస్తా కృష్ణస్వామి అవుతాడు. చివరికి
ఏమైందనేది స్టోరీ.
గొడవలన్నీ మరిచిపోయి అంతా ఒకటైపోతారనేది అందరికీ తెలిసిందే. దాన్నే కాస్త ఇంట్రెస్టింగ్ గా
చూపించి ఉంటే బాగుండేది. మరీ నాసిరకంగా తీశారు. శవంతో ప్రారంభమై, శవంతో ముగిసే ఈ సినిమాను
చూసిన తర్వాత ప్రేక్షకుడు కూడా అంతే నిర్జీవంగా తయారవుతాడు.
ఇక ఇంతోటి సినిమాకు నటీనటుల గురించి తెలుసుకోవడం అనవసరం అనిపిస్తుంది. కానీ సమీక్ష కోసం
చెప్పుకోక తప్పదు. అల్తాఫ్ హసన్ హీరో, శాంతారావు, శాత్విక, లావణ్య రెడ్డి హీరోయిన్లుగా నటించారు. వీళ్లలో అంతోఇంతో చెప్పుకోదగ్గ పాత్ర లావణ్య రెడ్డిదే. ఆమె చేసిన శ్రీదేవి పాత్ర అంతోఇంతో వినోదాన్నందిస్తుంది. మిగతా పాత్రల్లో భద్రం చేసిన కామెడీ ఓ మోస్తరుగా ఓకే అనిపిస్తుంది. దర్శకుడు రామ్ నారాయణ్ సహజత్వం పేరిట మరీ నాసిరకం సినిమా తీశాడు. ఇక నిర్మాతైతే కేవలం తన పాకెట్ మనీతో ఈ సినిమా తీశాడేమో అనిపిస్తుంది.
సినిమాల్లేక, థియేటర్లు మూతపడి, మొహం మొత్తేసిన టైమ్ లో వచ్చింది బట్టల రామస్వామి బయోపిక్కు. ఏదో ఒకటి దొరికింది కదా అని ఓపెన్ చేస్తే టైమ్ వేస్ట్ అవ్వడం ఖాయం. మరీ ఖాళీగా ఉంటే మాత్రం ఓసారి చూసేయండి. దీని కోసం జీ5 సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం మీ అంత అమాయకులు ఈ భూమ్మీద లేరని అర్థం.