సీటీ స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలంటే..

కరోనా టెస్టులు చేయించుకోవడం కోసం కొన్ని ఇబ్బందులు ఉండడం, అలాగే ర్యాపిడ్ టెస్టుల్లో రిజల్ట్స్ సరిగా రాకపోవడం వల్ల చాలామంది సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. కోవిడ్ ఉందన్న భయం రాగానే వెంటనే స్కానింగ్ కు వెళ్తున్నారు. అయితే కరోనా నిర్థారణ కోసం సీటీ స్కాన్ అంత సేఫ్ కాదని, దాని వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువని డాక్టర్లు చెప్తున్నారు. అసలు సీటీ స్కాన్ ఎప్పుడు అవసరమంటే.. కరోనా టెస్ట్ ఒక్కసారి కూడా చేయించుకోకుండా.. కేవలం అనుమానంతో ఛాతీ సీటీ స్కాన్‌ […]

Advertisement
Update:2021-05-13 08:12 IST

కరోనా టెస్టులు చేయించుకోవడం కోసం కొన్ని ఇబ్బందులు ఉండడం, అలాగే ర్యాపిడ్ టెస్టుల్లో రిజల్ట్స్ సరిగా రాకపోవడం వల్ల చాలామంది సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. కోవిడ్ ఉందన్న భయం రాగానే వెంటనే స్కానింగ్ కు వెళ్తున్నారు. అయితే కరోనా నిర్థారణ కోసం సీటీ స్కాన్ అంత సేఫ్ కాదని, దాని వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువని డాక్టర్లు చెప్తున్నారు. అసలు సీటీ స్కాన్ ఎప్పుడు అవసరమంటే..

కరోనా టెస్ట్ ఒక్కసారి కూడా చేయించుకోకుండా.. కేవలం అనుమానంతో ఛాతీ సీటీ స్కాన్‌ చేయించుకోవడం వల్ల ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్తున్నారు. కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండి.. కోవిడ్ టెస్టుల్లో నెగెటివ్ చూపిస్తుంటే అప్పుడు స్కాన్ అవసరం ఉంటుంది. స్కాన్ అనేది కేవలం కరోనా మూలంగా ఊపిరితిత్తుల్లో తలెత్తే మార్పులను పసిగట్టటానికే తప్ప జబ్బు నిర్ధారణకు కాదు. అందుకే కరోనా టెస్టుల్లో నెగెటివ్ వచ్చి, జ్వరం, శ్వాస సమస్యలు వేధిస్తుంటే వెంటనే స్కాన్ చేయించుకోవాలి. అందులోనూ.. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, సిగరెట్లు ఎక్కువగా తాగేవారికి స్కానింగ్ బాగా ఉపయోగపడొచ్చు

Tags:    
Advertisement

Similar News