ఐవర్ మెక్టిన్ పై రాద్ధాంతం..

ఫస్ట్ వేవ్ ప్రబలిన సమయంలో కూడా కొంతమంది డాక్టర్లు కరోనా వైద్యంలో ఐవర్ మెక్టిన్ అనే యాంటీ వైరల్ డ్రగ్ ని ఉపయోగించారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతిలో దీన్ని మరీ ఎక్కువగా వినియోగిస్తున్నారు. మందు ప్రభావం బాగా ఉందనే ప్రచారంతో దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐవర్ మెక్టిన్ ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో తప్పనిసరి చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఐవర్ […]

Advertisement
Update:2021-05-12 02:58 IST

ఫస్ట్ వేవ్ ప్రబలిన సమయంలో కూడా కొంతమంది డాక్టర్లు కరోనా వైద్యంలో ఐవర్ మెక్టిన్ అనే యాంటీ వైరల్ డ్రగ్ ని ఉపయోగించారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతిలో దీన్ని మరీ ఎక్కువగా వినియోగిస్తున్నారు. మందు ప్రభావం బాగా ఉందనే ప్రచారంతో దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐవర్ మెక్టిన్ ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో తప్పనిసరి చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఐవర్ మెక్టిన్ ఔషధాన్ని కరోనా చికిత్సలో ఉపయోగించొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా హెచ్చరించింది.

కొత్త వ్యాధులపై అప్పటికే ఉన్న మందులను వినియోగించాల్సి వచ్చినప్పుడు ఔషధ భద్రత, సమర్థత చాలా ముఖ్యమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కరోనాకు ఐవర్ మెక్టిన్ వాడొద్దని హెచ్చరించింది. ఈ మేర‌కు డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ ట్విట్టర్ లో వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్‌ లో తప్ప కొవిడ్ చికిత్సలో ఐవర్‌ మెక్టిన్‌ ను ఉపయోగించవద్దని సూచించారు. గత రెండు నెలల్లో ఐవర్ మెక్టిన్ వాడకంపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. జర్మనీకి చెందిన మెర్క్ అనే ఫార్మా సంస్థ కూడా ఇదేరకమైన సూచనలు జారీ చేసింది. తమ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఐవర్ మెక్టిన్ వాడకంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారని, ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల్లో కరోనాపై దాని ప్రభావం ఏమాత్రం లేదని తేలినట్టు చెప్పింది. భద్రత, ఔషధ సామర్థ్యంపై కూడా సరైన ఆధారాలు లభించలేదని మెర్క్ ఫార్మా సంస్థ తెలిపింది.

అయితే ఐవర్ మెక్టిన్ ని సమర్థించేవారు కూడా ఉండటం విశేషం. యాంటీ వైర‌ల్ డ్ర‌గ్ ఐవ‌ర్‌ మెక్టిన్ క‌రోనా చికిత్సలో సమర్థంగా పనిచేస్తుందని, మరణం ముప్పుని గణనీయంగా తగ్గిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. యూకే, ఇటలీ, స్పెయిన్, జపాన్ నిపుణుల బృందాలు కూడా ఐవర్ మెక్టిన్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించాయి, ఆయా దేశాల్లో కరోనా చికిత్సలో దీన్ని వాడుతున్నారు. అయితే అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్.డి.ఎ.) ఈ మందును తిరస్కరించడం విశేషం. అందుకే గోవా ప్రభుత్వం ఆ రాష్ట్రంలో 18 ఏండ్లు దాటిన వారందరికీ ఐవర్‌ మెక్టిన్‌ మాత్రలు పంపిణీ చేస్తామని ప్రకటించింది. గోవా ప్రజారోగ్య శాఖామంత్రి విశ్వజిత్ రాణే అన్ని స్థాయిల ఆస్పత్రుల్లో ఐవర్ మెక్టిన్ అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. లక్షణాలు ఉన్నా, లేకపోయినా కూడా దీన్ని వాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ మరోసారి జారీ చేసిన హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags:    
Advertisement

Similar News