ఆదిపురుష్ లో నేను లేను
మొన్నటివరకు ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఓ రూమర్ జోరుగా నటించింది. అదేంటంటే, ఈ సినిమాలో కీలక పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్ ను తీసుకున్నారట. ఆ కీలక పాత్ర ఏంటనే విషయం బయటకు రాలేదు కానీ, ఆదిపురుష్ లో సుదీప్ ఉన్నాడంటూ స్టోరీలు వచ్చేశాయి. దీనిపై తాజాగా సుదీప్ స్పందించాడు ఆదిపురుష్ సినిమాకు తనకు సంబంధం లేదని ప్రకటించాడు సుదీప్. ఇప్పటివరకు ఆదిపురుష్ యూనిట్ నుంచి ఎవ్వరూ తనను సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు. ఆదిపురుష్ లాంటి […]
మొన్నటివరకు ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఓ రూమర్ జోరుగా నటించింది. అదేంటంటే, ఈ
సినిమాలో కీలక పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్ ను తీసుకున్నారట. ఆ కీలక పాత్ర ఏంటనే విషయం
బయటకు రాలేదు కానీ, ఆదిపురుష్ లో సుదీప్ ఉన్నాడంటూ స్టోరీలు వచ్చేశాయి. దీనిపై తాజాగా సుదీప్
స్పందించాడు
ఆదిపురుష్ సినిమాకు తనకు సంబంధం లేదని ప్రకటించాడు సుదీప్. ఇప్పటివరకు ఆదిపురుష్
యూనిట్ నుంచి ఎవ్వరూ తనను సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు. ఆదిపురుష్ లాంటి పెద్ద సినిమాలో
ఆఫర్ వస్తే కచ్చితంగా ఆలోచిస్తానని, కానీ ఇప్పటివరకు వార్తల్లో వచ్చినవి పుకార్లు మాత్రమేనని
స్పష్టంచేశాడు.
ఆదిపురుష్ సినిమాకు సంబంధించి కీలకమైన రాముడు, లక్ష్మణుడు, రావణుడు పాత్రలు లాక్
అయిపోయాయి. వాళ్లతో షూటింగ్ కూడా మొదలైంది. మరి సుదీప్ ను తీసుకుంటే, అతడికిచ్చే కీలక పాత్ర ఏంటనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతానికైతే సుదీప్ కు ఆదిపురుష్ యూనిట్ నుంచి పిలుపురాలేదు. కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత సంప్రదింపులు షురూ చేస్తారేమో చూడాలి.