సెట్ ను విరాళంగా ఇచ్చిన "రాధేశ్యామ్"

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న వేళ.. ఓ మంచి నిర్ణయం తీసుకుంది రాధేశ్యామ్ యూనిట్. సినిమా కోసం వేసిన హాస్పిటల్ సెట్ ను కరోనా రోగుల కోసం విరాళంగా ఇచ్చేసింది. రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే డాక్టర్ గా కనిపించబోతోంది. ఆమె పాత్ర పేరు ప్రేరణ. దీని కోసం హాస్పిటల్ సెట్ వేశారు. 50 మంచాలు, పరుపులు, ఆక్సిజన్ సిలిండర్లు అన్నీ ఏర్పాటుచేశారు. సహజంగా కనిపించడం కోసం అన్నీ ఒరిజినల్ వే వాడారు. అంతా సెట్ అయిందనుకున్న […]

Advertisement
Update:2021-05-10 14:38 IST

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న వేళ.. ఓ మంచి నిర్ణయం తీసుకుంది రాధేశ్యామ్ యూనిట్. సినిమా కోసం వేసిన హాస్పిటల్ సెట్ ను కరోనా రోగుల కోసం విరాళంగా ఇచ్చేసింది.

రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే డాక్టర్ గా కనిపించబోతోంది. ఆమె పాత్ర పేరు ప్రేరణ. దీని కోసం హాస్పిటల్ సెట్ వేశారు. 50 మంచాలు, పరుపులు, ఆక్సిజన్ సిలిండర్లు అన్నీ ఏర్పాటుచేశారు. సహజంగా కనిపించడం కోసం అన్నీ ఒరిజినల్ వే వాడారు. అంతా సెట్ అయిందనుకున్న టైమ్ కు కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది.

దీంతో సెట్ మొత్తాన్ని కరోనా పేషెంట్ల కోసం విరాళంగా ఇచ్చేశారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. సెట్ ను అలాగే ఉంచి.. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, పరుపులు, ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ మొత్తాన్ని హాస్పిటల్స్ కు, ఛారిటీకి ఇచ్చేశారు. సకాలంలో స్పందించిన యూవీ క్రియేషన్స్ నిర్మాతల్ని అంతా మెచ్చుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News