ప్లాన్ మార్చిన ఆదిపురుష్
ఆదిపురుష్ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ముంబయిలో షూటింగ్స్ పై ఆంక్షలు విధించడంతో పాటు.. అంతకంటే ముందే స్టుడియోలో అగ్నిప్రమాదం జరగడంతో ఆదిపురుష్ షూటింగ్ నిలిచిపోయింది. అలా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోతున్నప్పటికీ.. దర్శకుడు మాత్రం కొత్త షెడ్యూల్ కు ప్లాన్ ఫిక్స్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 14న హైదరాబాద్ లో ఆదిపురుష్ కొత్త […]
ఆదిపురుష్ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ముంబయిలో షూటింగ్స్ పై ఆంక్షలు విధించడంతో
పాటు.. అంతకంటే ముందే స్టుడియోలో అగ్నిప్రమాదం జరగడంతో ఆదిపురుష్ షూటింగ్ నిలిచిపోయింది.
అలా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నాడు దర్శకుడు ఓం రౌత్.
ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోతున్నప్పటికీ..
దర్శకుడు మాత్రం కొత్త షెడ్యూల్ కు ప్లాన్ ఫిక్స్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 14న
హైదరాబాద్ లో ఆదిపురుష్ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.
ఆదిపురుష్ కు సంబంధించి అంతా సెట్ లో షూటింగ్ వ్యవహారమే. పైగా గ్రాఫిక్ వర్క్ కాబట్టి.. తక్కువ
టీమ్ తో పనైపోతుంది. అందుకే కరోనా వేళ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి యూనిట్ రెడీ అవుతోంది.
అన్ని రకాల ముందుజాగ్రత్తలతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా 90
రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని ప్రకటించాడు దర్శకుడు.