మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్..

భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖను తనకు బదలాయించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈమేరకు గవర్నర్ కు లేఖ రాసిన కేసీఆర్ ఆ లాంఛనాన్ని పూర్తి చేశారు. తెలంగాణ మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు పోర్ట్ ఫోలియో లేని మంత్రిగా ఉన్న ఈటల.. సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. […]

Advertisement
Update:2021-05-02 16:37 IST

భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖను తనకు బదలాయించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈమేరకు గవర్నర్ కు లేఖ రాసిన కేసీఆర్ ఆ లాంఛనాన్ని పూర్తి చేశారు. తెలంగాణ మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు పోర్ట్ ఫోలియో లేని మంత్రిగా ఉన్న ఈటల.. సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఈటలను వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించిన వెంటనే ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి, తన కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న రాజశేఖర్‌ రెడ్డికి సంబంధిత శాఖ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఈటలను పూర్తిగా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అటు మెద‌క్ జిల్లా మాసాయిపేట మండ‌లంలోని అచ్చంపేట‌, హ‌కీంపేట‌ గ్రామాల ప‌రిధిలోని అసైన్డ్ భూముల‌ను ఈట‌ల రాజేంద‌ర్ క‌బ్జా చేసింది నిజ‌మేనని అధికారులు తేల్చారు. ఈ మేర‌కు మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రీష్ నివేదిక రూపొందించారు. హ‌కీంపేట‌, అచ్చంపేట గ్రామాల్లో క‌లిపి 66 ఎక‌రాల ఒక గుంట అసైన్డ్ భూమిని ఈట‌ల‌ క‌బ్జా చేసిన‌ట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. క‌బ్జా చేసిన భూముల్లో జ‌మున హ్యాచ‌రీస్ తరపున షెడ్లు నిర్మించిన‌ట్లు నివేదిక‌లో క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. కొన్ని చెట్లు న‌రికివేసి రోడ్లు కూడా నిర్మించిన‌ట్లు అట‌వీశాఖ అధికారులు తేల్చారు. వ్య‌వ‌సాయేత‌ర భూముల మార్పిడి చ‌ట్టాన్ని జ‌ము హ్యాచ‌రీస్ సంస్థ ఉల్లంఘించి, భారీ ఎత్తున పౌల్ర్టీ షెడ్లు, నిర్మాణ ప‌నుల‌ను చేప‌ట్టార‌ని నివేదిక‌లో పొందుప‌రిచారు. రెవెన్యూ రిక‌వ‌రీ చ‌ట్టం కింద జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తుకి సంబంధించిన పూర్తి నివేదిక సీఎస్‌ కు అధికారులు అందించారు.

తనపై వచ్చిన ఆరోపణలపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఈటల, ఓ పథకం ప్రకారమే తనని టార్గెట్ చేశారని అన్నారు. నాగార్జున సాగర్ ఫలితాల వేళ.. ఈటల వర్గం కాస్త సంయమనం పాటించినట్టు తెలుస్తోంది. అటు టీఆర్ఎస్ నుంచి కూడా ఎలాంటి కవ్వింపు వ్యాఖ్యలు లేవు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ వెలువడిన నిర్ణయంపై ఈటల వర్గం స్పందించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News