తెలంగాణలో నో ‘లాక్డౌన్’
తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రస్తుతం కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో లాక్డౌన్ పెడతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎర్రబెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే సీఎం కేసీఆర్‌కు యాంటిజెన్ టెస్ట్‌లో కరోనా నెగిటివ్ వచ్చినట్టు సమాచారం. దీంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశారు. ఈ […]
తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రస్తుతం కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో లాక్డౌన్ పెడతారని ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎర్రబెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే సీఎం కేసీఆర్‌కు యాంటిజెన్ టెస్ట్‌లో కరోనా నెగిటివ్ వచ్చినట్టు సమాచారం. దీంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశారు. ఈ రిజల్ట్ కోసం వైద్యులు ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ .. కరోనా నుంచి కోలుకున్నాక అధికారులతో సమావేశం కానున్నట్టు సమాచారం.
ఆ తర్వాత లాక్డౌన్ పై ఓ నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కూడా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
అయితే కరోనా ను కట్టడి చేయడంలో తెలంగాణ సర్కారు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఇప్పటికే హైకోర్టు పలుమార్లు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేయబోతున్నారు.