తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గుడ్ న్యూస్..!
మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వాళ్లకు వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్ ఫ్రీ కాదని.. డబ్బు వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు వ్యాక్సిన్ సంస్థలు సైతం ధరలను ప్రకటించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ చేయాలన్న డిమాండ్ ఊపందుకున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వాళ్లకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన వాళ్లకు కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారని అంతా […]
మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వాళ్లకు వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్ ఫ్రీ కాదని.. డబ్బు వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. మరోవైపు వ్యాక్సిన్ సంస్థలు సైతం ధరలను ప్రకటించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ చేయాలన్న డిమాండ్ ఊపందుకున్నది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వాళ్లకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన వాళ్లకు కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారని అంతా భావించారు. కానీ కేంద్రం మాత్రం 18 ఏళ్లు నిండిన వాళ్లకు 45 ఏళ్ల లోపు వాళ్లకు వ్యాక్సినేషన్ టైంలో డబ్బు వసూలు చేస్తామని ప్రకటించింది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి.. తమ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కు అయ్యే ఖర్చును తామే భరిస్తామని ప్రకటించాయి.
ఉత్తర్ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఈ మేరకు తొలుత ప్రకటన చేశాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నట్టు ప్రటించింది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. తమ రాష్ట్రంలో ఉచితంగానే వ్యాక్సిన్ అందిస్తామని ఆయన ప్రకటించారు. శనివారం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
దీని వల్ల ప్రభుత్వంపై రూ.2500 కోట్ల భారం పడనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సంబంధింత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నాటి నుంచే ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సైతం స్వయంగా పర్యవేక్షించనున్నారు.