ఎస్‌ఎల్‌బీసీ ఆపరేషన్ రెండు రోజుల్లో పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్‌

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement
Update:2025-02-26 18:06 IST

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద స్థలికి చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. గ్యాస్ కట్టర్‌తో కట్ చెసి దెబ్బ తిన్న టీబీఎంను వేరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. వారు బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం చేశాం. టన్నెల్‌లో బురద పేరుకుపోయింది. 15 నుంచి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయింది. అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు.

ఒక మానవీయ కోణంపై విపక్షాలు దిగజారి మాట్లాడుతున్నాయి. దేశంలోని అన్ని బెస్ట్‌ రెస్క్యూ టీములను రప్పించాం’’ అని ఉత్తమ్‌ తెలిపారు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తున్నాం. గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి దెబ్బతిన్న టీబీఎంను వేరు చేస్తాం. ఎస్‌ఎల్‌బీసీ పూడికలోకి వెళ్లాలని నిర్ణయించాం. మట్టి, నీరుతో పేరుకుపోయిన సిల్ట్‌ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించామన్నారు. విదేశాల్లో ఉన్న టన్నెల్‌ ఎక్స్‌పర్ట్స్‌ సూచనలతో ముందుకెళ్తున్నాం. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడటమే మా లక్ష్యం’’ అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News