18 ఏళ్లు నిండాయా? అయితే ఈ యాప్​ డౌన్​లోడ్​ చేసుకోండి..!

దేశంలో కరోనా కోరలు చాస్తున్న విషయం తెలిసిందే. అసంఖ్యాకంగా నమోదవుతున్న కేసులు చూసి ప్రజలు వణికిపోతున్నారు. ఇక తొలిదశ వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నది. అయితే చాలా మందికి మొదటి డోసు ఇచ్చారు. కొంతమందికి మొదటి డోసు కూడా ఇవ్వలేదు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే 18 ఏళ్లు నిండిన వాళ్లందరికి వ్యాక్సినేషన్​ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్​ ఇస్తున్నారు. అది కూడా ఉచితంగానే . […]

Advertisement
Update:2021-04-23 02:57 IST

దేశంలో కరోనా కోరలు చాస్తున్న విషయం తెలిసిందే. అసంఖ్యాకంగా నమోదవుతున్న కేసులు చూసి ప్రజలు వణికిపోతున్నారు. ఇక తొలిదశ వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నది. అయితే చాలా మందికి మొదటి డోసు ఇచ్చారు. కొంతమందికి మొదటి డోసు కూడా ఇవ్వలేదు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే 18 ఏళ్లు నిండిన వాళ్లందరికి వ్యాక్సినేషన్​ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్​ ఇస్తున్నారు. అది కూడా ఉచితంగానే .

అయితే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్​ ఇవ్వబోతున్నారు. ఈ వ్యాక్సిన్​కు డబ్బు వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తామే డబ్బు భరిస్తామని.. ప్రజల దగ్గర వసూలు చేయబోమని ప్రకటించాయి. కేంద్రం గతంలో ఎన్నికల టైంలో కొన్ని రాష్ట్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్​ ఇస్తామని హామీ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్​ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే మే 1 నుంచి ఇవ్వబోయే వ్యాక్సిన్​ కోసం ఓ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలంటూ కేంద్రం సూచించింది. అదే కోవిన్​ యాప్​. ఏప్రిల్​ 24 నుంచి ఈ యాప్​లో వ్యాక్సిన్​ కావాల్సిన వాళ్లు రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని సూచించింది. ఇక ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్​ ఇవ్వనున్నారు.

కోవిషీల్డ్​ వ్యాక్సిన్​ను రాష్ట్ర ప్రభుత్వాలకు సింగిల్‌ వ్యాక్సిన్‌ డోస్‌ ధర 400 రూపాయలు, కేంద్రానికి సింగిల్‌ డోస్‌ 150 రూపాయలకు అందజేయనున్నట్టు సీరం సంస్థ తెలిపింది. ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఒక్కో వ్యాక్సిన్‌ డోస్‌ 600 రూపాయలకు ఇస్తామని చెప్పింది. ఇతర దేశాల వ్యాక్సిన్​తో పోల్చి చూస్తే కోవిషీల్డ్​ ధర చాలా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెలలో భారీ ఎత్తున కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తామని సీరం సంస్థ సీఈవో వెల్లడించారు.

అయితే రాష్ట్రాలకు, కేంద్రాలకు వేరు వేరు రేట్లకు వ్యాక్సిన్​ ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ఫైర్​ అయ్యారు. కేంద్ర, రాష్ట్రాలకు వేరు వేరు ధరలు ఎందుకు నిర్ణయించారంటూ ఆయన ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News