‘కోవిడ్’ను ఎలా కంట్రోల్​ చేద్దాం..! సీఎం జగన్​ సమీక్ష..!

ఆంధ్రప్రదేశ్​లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఏపీ సీఎం జగన్​​మోహన్​ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనాను కంట్రోల్​ చేసేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 104 కాల్​ సెంటర్​ ను మరింత విస్తృతంగా వినియోగించాలని కోరారు. కరోనా రోగులు కోరితే మూడు గంటల్లోనే వాళ్లకు ఆస్పత్రిలో బెడ్​ ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. […]

Advertisement
Update:2021-04-16 04:45 IST

ఆంధ్రప్రదేశ్​లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఏపీ సీఎం జగన్​​మోహన్​ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనాను కంట్రోల్​ చేసేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 104 కాల్​ సెంటర్​ ను మరింత విస్తృతంగా వినియోగించాలని కోరారు.

కరోనా రోగులు కోరితే మూడు గంటల్లోనే వాళ్లకు ఆస్పత్రిలో బెడ్​ ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్న వారిని వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలించాలని .. వాళ్లకు కోవిడ్​ కిట్​ అందజేయాలని కోరారు. అవసరమైతే వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని కోరారు.

ప్రజలు మాస్కులు ధరించేలా, భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పించాలని కోరారు. వ్యాక్సినేషన్​ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని.. అవసరమైతే అదనపు డోసుల వ్యాక్సిన్​ కోసం కేంద్రానికి లేఖ రాద్దామని చెప్పారు. కరోనా పేరు చెప్పి కొన్ని ప్రైవేట్​ ఆస్పత్రులు దోపిడీకి తెరలేపాయని.. అటువంటి ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 6.21 లక్షల మందికి వ్యాక్సిన్లు అందించామని అధికారులు సీఎం జగన్​కు తెలిపారు.

కరోనా పై అవగాహన కోసం ప్రజలు 1902 నంబర్​లో సంప్రదించాలని కోరారు. కరోనా పేషెంట్ల దగ్గర ఎంత ఫీజు తీసుకుంటున్నారు? వాళ్లకు ఎటువంటి మందులు ఇస్తున్నారు? ఎటువంటి సేవలు అందించబోతున్నారు? తదితర వివరాలను ప్రతి ప్రైవేట్​ ఆస్పత్రి డిస్​ప్లే లో పెట్టాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ప్రైవేట్​ ఆస్పత్రులకు మార్గదర్శకాలు అందజేయాలని సూచించారు. పేద ప్రజలకు వీలైనంత వరకు ప్రభుత్వమే చికిత్స అందించేలా చూడాలని కోరారు. తక్కువ లక్షణాలు ఉన్నవాళ్లకు కోవిడ్​ కిట్​ ను అందజేసి ఇంట్లోనే చికిత్స అందించాలని సూచించారు.

ప్రస్తుతం ఏపీలో 6.03 శాతం కోవిడ్ పాజివిటీ రేటు ఉందని అధికారులు సీఎం జగన్​కు వివరించారు. 108 ఆస్పత్రుల్లో 15,669 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బుధవారం వరకు ఏపీలో 22,637 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News