వీటిని గూగుల్ చేశారో.. అంతే!

చిన్నపిల్లల నుంచి ప్రొఫెషనల్స్ వరకు ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా టక్కున అడిగేది గూగుల్ నే.. అయితే గూగుల్ ను అన్ని విషయాలు అడగడం కూడా అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. అసలు గూగుల్‌ని ఎంతవరకు నమ్మొచ్చు? నిపుణులు ఏం చెప్తున్నారు? ఇంటర్నెట్‌లో మోసాలు చేసే హ్యాకింగ్ సైట్స్ కు కొదవ లేదు. అయితే గూగుల్‌కి ఏది ఒరిజినల్ సైట్, ఏది ఫేక్ వెబ్‌సైట్ అన్న విషయాలు తెలీవు. మనం అడిగిన దానికి రిలేటెడ్ గా […]

Advertisement
Update:2021-04-15 11:22 IST

చిన్నపిల్లల నుంచి ప్రొఫెషనల్స్ వరకు ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా టక్కున అడిగేది గూగుల్ నే.. అయితే గూగుల్ ను అన్ని విషయాలు అడగడం కూడా అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. అసలు గూగుల్‌ని ఎంతవరకు నమ్మొచ్చు? నిపుణులు ఏం చెప్తున్నారు?

ఇంటర్నెట్‌లో మోసాలు చేసే హ్యాకింగ్ సైట్స్ కు కొదవ లేదు. అయితే గూగుల్‌కి ఏది ఒరిజినల్ సైట్, ఏది ఫేక్ వెబ్‌సైట్ అన్న విషయాలు తెలీవు. మనం అడిగిన దానికి రిలేటెడ్ గా ఉన్న సైట్స్ అన్నీ మనకు డిస్ ప్లే చేస్తుంది. ఏది నిజమైందో మనమే తేల్చుకోవాలి. తేల్చుకోలేకపోతే నష్టపోయినట్టే. అందుకే కొన్ని విషయాలు గూగుల్‌ని అడగడం కరెక్ట్ కాదంటున్నారు టెక్ నిపుణులు. అవేంటంటే..

యాంటీ వైరస్
యాంటీ వైరస్‌ల గురించి కూడా గూగుల్‌లో సెర్చ్ చేయడం అంత సేఫ్ కాదు. యాంటీ వైరస్ పేరుతో బోలెడు వైరస్‌లు ఇంటర్నెట్‌లో రెడీగా కాచుకుని కూచుంటాయి. క్లిక్ చేయడం ఆలస్యం వచ్చి మన సిస్టమ్‌ని అటాక్ చేస్తాయి. అందుకే యాంటీ వైరస్ కావాలంటే ఆయా కంపెనీల ఒరిజినల్ వెబ్సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి.

సాఫ్ట్ వేర్స్
యాప్‌లు లేదా సాఫ్ట్‌వేర్‌లను గూగుల్‌లో సెర్చ్ చేసి, డౌన్‌లోడ్ చేయడం చాలామంది చేసే పెద్ద మిస్టేక్. పీసీ సాఫ్ట్‌వేర్లు, మొబైల్ యాప్స్ కోసం ప్రత్యేకంగా ఉండే యాప్ స్టోర్స్, ప్లే స్టోర్స్ ను వాడాలి. అలా కాకుండా గూగుల్‌లో సెర్చ్ చేసి, సాఫ్ట్‌వేర్లు, యాప్స్ డౌన్‌లోడ్ చేస్తే.. మన కంప్యూటర్, మొబైల్స్‌లోకి మాల్‌వేర్‌‌ను, వైరస్‌ను ఆహ్వానించినట్టే. ఎన్నో వెబ్‌సైట్లు డూప్లికేట్ యాప్స్‌ను, డూప్లికేట్ సాఫ్ట్‌వేర్లను ఇంటర్నె్ట్‌లో అప్‌లోడ్ చేస్తుంటాయి. వాటిని మన సిస్టమ్స్‌లోకి ఇన్‌స్టాల్ చేసుకుంటే మాల్‌వేర్, యాడ్‌వేర్ లాంటి వైరస్‌లు అటాక్ చేసే ప్రమాదముంది.

బ్యాంకింగ్ పోర్టల్స్
మీ బ్యాంకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లను గూగుల్‌లో సెర్చ్ చేయకపోవడమే మంచిది. నిజమైన బ్యాంక్ వెబ్‌సైట్‌తో పాటు, చూడ్డానికి అలానే కనిపించే ఫేక్ వెబ్‌సైట్స్ కూడా గూగుల్ లో ఎన్నో ఉంటాయి. బ్యాంక్ వెబ్ సైట్ స్పెల్లింగ్ కాస్త అటు ఇటుగా ఉన్న వెబ్‌సైట్స్ అన్ని గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో చూపిస్తుంది. అందులో సరైన వెబ్ సైట్‌ను గుర్తుపట్టి లింక్ క్లిక్ చేయాలి. ఒకవేళ పొరపాటున వేరే ఫేక్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి లాగిన్ వివరాలు ఎంటర్ చేస్తే అంతే సంగతి. సైబర్ నేరగాళ్లకు మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్పజెప్పినట్టే.. అందుకే బ్యాంక్ వెబ్‌సైట్ యూఆర్‌‌ఎల్‌ను తెలుసుకుని డైరెక్ట్‌గా యూఆర్ఎల్ ఎంటర్ చేయడం ద్వారా సేఫ్‌గా ఉండొచ్చు.

సింప్టమ్స్
గూగుల్ సెర్చింజన్‌లో మందులు లేదా మెడికల్ సింప్టమ్స్‌ను సెర్చ్ చేయకూడదు. గూగుల్‌లో చూసి ఆరోగ్యం పై ఒక అంచనాకి రాకూడదు. నూటికి తొంబై శాతం మెడికల్ వెబ్‌సైట్స్‌ను డాక్టర్లు మైంటైన్ చేయరు.అందులో జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అందుకే వాటిని నమ్మి, రోగాన్ని నిర్దారించుకోకూడదు.

ఇవి వద్దు
ఇవే కాకుండా బాంబులు ఎలా తయారు చేస్తారు? డ్రగ్స్ అంటే ఏంటి? ఇలాంటి విషయాలు పొరపాటున కూడా గూగుల్‌లో సెర్చ్ చేయకూడదు. ఇలాంటివి రెగ్యులర్ గా సెర్చ్ చేసే వారిని పోలీసులు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే సరదాగా తెలుసుకుందాం అనే ఉద్ధేశంతో వాటిని సెర్చ్ చేయకపోవడం బెటర్.

Tags:    
Advertisement

Similar News