సోనూ ఔదార్యం..పిల్లల కోసం టవర్ ఏర్పాటు
ప్రముఖ నటుడు సోనూ సుద్.. లాక్డౌన్ లో రియల్ హీరో అనిపించుకున్నారు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్న పేదలకు తన వంతు సాయం అందజేసి .. వాళ్లను ఆదుకున్నారు. దీంతో సోనూ పేరు సోషల్మీడియాలో మారు మోగిపోయింది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు కష్టాల్లో ఉన్నట్టు సోనూ చెవిన పడిన వెంటనే వాళ్లకు తన వంతు సాయం చేశారు. లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయిన ఎందరికో సోనూ సాయం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు. ఉపాధి కూలీలకు […]
ప్రముఖ నటుడు సోనూ సుద్.. లాక్డౌన్ లో రియల్ హీరో అనిపించుకున్నారు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్న పేదలకు తన వంతు సాయం అందజేసి .. వాళ్లను ఆదుకున్నారు. దీంతో సోనూ పేరు సోషల్మీడియాలో మారు మోగిపోయింది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు కష్టాల్లో ఉన్నట్టు సోనూ చెవిన పడిన వెంటనే వాళ్లకు తన వంతు సాయం చేశారు.
లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయిన ఎందరికో సోనూ సాయం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు. ఉపాధి కూలీలకు డబ్బులు పంపారు. మొత్తానికి ప్రభుత్వాలు చేయాల్సిన పనిని సోనూ చేశారు.తాజాగా సోనూ సుద్ ఓ ఊర్లోని విద్యార్థులు ఇంటర్నెట్ లేక ఇబ్బందులు పడుతుండటంతో వాళ్లకు ఏకంగా టవర్ ఏర్పాటు చేయించి ఔదార్యాన్ని చాటుకున్నారు.
కరోనా కారణంగా చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు కొనసాగడం లేదు. విద్యార్థులు ఇంటి దగ్గరే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. నాగ్‌పూర్ కు సమీపంలోని గొడియా జిల్లాలోని ఓ గ్రామ విద్యార్థులకు ఇంటర్నెట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ క్లాసులు వినలేకపోతున్నారు.
ఈ విషయం సోనూ చెవిన పడింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని సోనూ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. ఆ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేసేశారు. కొన్ని గంటల్లోనే గ్రామానికి సెల్ టవర్ రావడంతో గ్రామస్థులంతా సంతోష పడుతున్నారు. అనంతరం ఆ ఊరి ప్రజలతో సోనూ వీడియో కాల్లో మాట్లాడారు. విద్యార్థులకు అండగా నిలిచిన సోనూపై ప్రశంసల జల్లు కురుస్తోంది.