ఈ పాపం ఎవరిది?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమ సమయంలో చాలా మంది యువత నమ్మారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. కానీ, వాళ్లు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాలేదు. తాజాగా ఓ నిరుద్యోగి తనకు ప్రత్యేక రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న బాధతో ఇటీవల ఆత్మహత్యా చేసుకొని.. ఇవాళ మృతిచెందాడు. మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్​ సింగ్​ తండాకు చెందిన బోడ సునీల్​ నాయక్​(25) డిగ్రీ పూర్తిచేశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం […]

Advertisement
Update:2021-04-02 13:01 IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమ సమయంలో చాలా మంది యువత నమ్మారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. కానీ, వాళ్లు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాలేదు. తాజాగా ఓ నిరుద్యోగి తనకు ప్రత్యేక రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న బాధతో ఇటీవల ఆత్మహత్యా చేసుకొని.. ఇవాళ మృతిచెందాడు.

మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్​ సింగ్​ తండాకు చెందిన
బోడ సునీల్​ నాయక్​(25) డిగ్రీ పూర్తిచేశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. 2016లో పోలీస్​ ఉద్యోగ నియామకాల్లో అర్హత సాధించి దేహదారుఢ్య పరీక్షలో రాణించలేదు.

ప్రస్తుతం హన్మకొండ నయీంనగర్​లో ఉంటూ ఓ గదిని అద్దె తీసుకొని కేయూలోని గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్నాడు. గత నెల 26న కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు కొందరు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే సునీల్​ నాయక్​ ఇవాళ చికిత్సపొందుతూ మృతి చెందాడు. అయితే ఆత్మహత్య చేసుకోబోయే ముందు సునీల్ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

‘ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాను. కానీ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలో నాలాగా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. నా చావుతోనైనా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి’ అంటూ వీడియోలో మాట్లాడాడు. ఈ వీడియో వైరల్​గా మారింది.

ఇదిలా ఉంటే సునీల్​ మృతితో రాష్ట్రంలో అక్కడక్కడ ఆందోళనలు సాగుతున్నాయి. సునీల్​ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కొందరు నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్​ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. మరోవైపు నిరుద్యోగ సంఘాలు, ప్రజాస్వామిక వాదులు సునీల్​కు మద్దతుగా సోషల్​మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే నంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News