తెలంగాణలో నో లాక్​డౌన్​..!

తెలంగాణలో లాక్​డౌన్​ ఏమీ ఉండదని సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారు. ఇవాళ అంటే శుక్రవారం ఆయన ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడారు.. ‘తెలంగాణలో మళ్లీ లాక్​డౌన్​ పెట్టబోతున్నారా? అని కొందరు సినీ ప్రముఖలు నన్ను అడిగారు. తెలంగాణలో లాక్​డౌన్​ ఏమీ పెట్టడం లేదు. కానీ కరోనా కేసులు పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాస్తవానికి స్కూళ్లు బంద్​ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. […]

Advertisement
Update:2021-03-26 12:58 IST

తెలంగాణలో లాక్​డౌన్​ ఏమీ ఉండదని సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారు. ఇవాళ అంటే శుక్రవారం ఆయన ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడారు.. ‘తెలంగాణలో మళ్లీ లాక్​డౌన్​ పెట్టబోతున్నారా? అని కొందరు సినీ ప్రముఖలు నన్ను అడిగారు. తెలంగాణలో లాక్​డౌన్​ ఏమీ పెట్టడం లేదు. కానీ కరోనా కేసులు పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

వాస్తవానికి స్కూళ్లు బంద్​ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ పిల్లల భవిష్యత్​ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గతంలో లాక్​డౌన్​ విధించడంతో చాలా రంగాలు కుదేలయ్యాయి. సినీ రంగం కూడా ఎంతో నష్టపోయింది. షూటింగ్​లు నిలిచిపోయాయి. నిర్మాతలు నష్టాలను చవిచూశారు. చాలా సినిమాల షూటింగ్​లు ఆగిపోయాయి. ప్రస్తుతం మళ్లీ షూటింగ్​లు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు తొందరపడి లాక్​డౌన్​పై ఎటువంటి నిర్ణయం తీసుకోము.’ అని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్​ సమానస్థాయిలోనే పంపిణీ చేస్తోందన్నారు. కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్నదని ఇది మన దురదృష్టం అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇటీవల విద్యాసంస్థలు మూసివేయడంతో.. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్నదని.. మళ్లీ లాక్​డౌన్​ విధించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నా కేసులు సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూ విధించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నది.

Tags:    
Advertisement

Similar News