ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేం..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడం కుదరదని ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్​ తేల్చిచెప్పారు. ఈ నెల 31తో తన పదవీ కాలం ముగియబోతున్నదని.. ఆ లోపే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టేవారు ఎన్నికల కోసం షెడ్యూల్​ విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి.. ఏపీ ప్రభుత్వానికి చాలా కాలంగా సఖ్యత లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి తీరతానని ఎన్నికల కమిషనర్​.. వద్దని ప్రభుత్వం […]

Advertisement
Update:2021-03-24 11:57 IST

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడం కుదరదని ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్​ తేల్చిచెప్పారు. ఈ నెల 31తో తన పదవీ కాలం ముగియబోతున్నదని.. ఆ లోపే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టేవారు ఎన్నికల కోసం షెడ్యూల్​ విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి.. ఏపీ ప్రభుత్వానికి చాలా కాలంగా సఖ్యత లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి తీరతానని ఎన్నికల కమిషనర్​.. వద్దని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే చివరకు కోర్టుకెళ్లి నిమ్మగడ్డ తన పంతం నెగ్గించుకున్నారు.

అయితే ఆయన ఎన్నికల కమిషనర్​గా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ పెద్దలకు నిమ్మగడ్డ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. నిమ్మగడ్డ తన అధికారాలను విస్తృతంగా వినియోగించారు. ఏ ఎన్నికల కమిషనర్​ చేయని విధంగా జిల్లా యాత్రలు నిర్వహించారు. మంత్రులకు నోటీసులు ఇచ్చారు. కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఆపేయాలంటూ ఆదేశాలు జారీచేశారు.

అయితే నిమ్మగడ్డ రమేశ్​ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. అధికార పార్టీ నేతలు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. టీడీపీ ఈ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నది. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇదే ఊపులో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం కోరుతున్నది.

గతంలో ఎంతో హడావుడిగా ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేసిన నిమ్మగడ్డ ప్రస్తుతం తటపటాయిస్తున్నారు. టీడీపీకి మేలు చేకూర్చేందుకే ఆయన అలా ప్రవర్తిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 31తో ఆయన పదవీ కాలం ముగియబోతున్నది.
తాను ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఎన్నికల కమిషనర్​ స్పష్టం చేశారు. అంతేకాక.. గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏవైనా అవకతవకలు, అక్రమాలు జరిగిఉంటే ఫిర్యాదు చేసుకోవచ్చని కూడా ఆయన సూచించారు. పంచాయతీ, మున్సిపల్​ ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని ఆయన చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అవలంభించిన మంచి పద్ధతులను అమలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూడా పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News