ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్.. వివరాలివే..
వేసవిలో చల్లని కాశ్మీరానికి టూరేద్దామనుకుంటున్నారా? అయితే మీకోసమే ‘ఎన్‌ఛాంటింగ్ కాశ్మీర్’ పేరుతో ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా గుల్మార్గ్, పహల్గమ్, శ్రీనగర్, సోన్‌మార్గ్ చూడొచ్చు. అంతేకాదు ప్రతీ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే తులీప్ గార్డెన్ ఫెస్టివల్ కూడా ఈ ట్రిప్‌లో భాగంగా చూసి రావచ్చు. 5 రాత్రులు, 6 రోజులు ఉండే ఈ టూర్ 2021 మార్చి 30, ఏప్రిల్ 20 తేదీల్లో మొదలవుతుంది. ఢిల్లీ నుంచి మొదలయ్యే ఈ టూర్ […]
వేసవిలో చల్లని కాశ్మీరానికి టూరేద్దామనుకుంటున్నారా? అయితే మీకోసమే ‘ఎన్‌ఛాంటింగ్ కాశ్మీర్’ పేరుతో ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా గుల్మార్గ్, పహల్గమ్, శ్రీనగర్, సోన్‌మార్గ్ చూడొచ్చు. అంతేకాదు ప్రతీ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే తులీప్ గార్డెన్ ఫెస్టివల్ కూడా ఈ ట్రిప్‌లో భాగంగా చూసి రావచ్చు.
5 రాత్రులు, 6 రోజులు ఉండే ఈ టూర్ 2021 మార్చి 30, ఏప్రిల్ 20 తేదీల్లో మొదలవుతుంది. ఢిల్లీ నుంచి మొదలయ్యే ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, సైట్ సీయింగ్, అకామిడేషన్,హౌజ్ బోట్‌లో స్టే, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
మొదటి రోజు ఢిల్లీ నుంచి ఫ్లైట్ ద్వారా శ్రీనగర్ చేరుకుంటారు. ఆ రోజు అక్కడే స్టే ఉంటుంది. రెండో రోజు ఉదయం శ్రీనగర్ నుంచి సోన్‌మార్గ్ తీసుకెళ్తారు. అక్కడ మంచు కొండల్లో విహరించొచ్చు. మళ్లీ సాయంత్రానికి శ్రీనగర్‌కు తిరిగి చేరుకోవాలి. రాత్రికి శ్రీనగర్‌లో బస ఉంటుంది.
మూడో రోజు ఉదయం శ్రీనగర్ నుంచి పహల్గమ్ తీసుకెళ్తారు. కుంకుమ పొలాలు, అవంతిపూర్ శిధిలాలు, బేతాబ్ వ్యాలీ, చందన్‌వారీ, అరు వ్యాలీలు అక్కడ చూడొచ్చు. అలా సాయంత్రానికి తిరిగి శ్రీనగర్ చేరుకోవాలి.
నాలుగో రోజు ఉదయం గుల్మార్ బయల్దేరాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్ గుల్మార్గ్ గండోలా, ఖిలాన్‌మార్గ్ చూడొచ్చు. అవన్నీ వీక్షించిన తర్వాత తిరిగి శ్రీనగర్ కు చేరుకోవాలి.
ఐదో రోజు ఉదయం శంకరాచార్య ఆలయం, మొఘల్ గార్డెన్స్, నిశాంత్ బాఘ్, చీష్‌మషాహి, షాలిమార్ గార్డెన్స్ చూడొచ్చు. తులీప్ గార్డెన్స్‌లో విహరించొచ్చు. ఆ తర్వాత సాయంత్రం షాపింగ్ కోసం కొంత సమయం ఉంటుంది. ఆ తర్వాత నైట్అంతా హౌజ్ బోట్‌లో స్టే ఉంటుంది. ఇక ఆరో రోజు ఉదయం శ్రీనగర్ నుంచి ఢిల్లీ బయల్దేరాలి. మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీనగర్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1.50 గంటలకు ఢిల్లీ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధరరూ.24,935 ఉంది. . ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.25,825 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.38,705 ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.