లాక్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయా..?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 3నెలలుగా స్తబ్దుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది. రెండు వారాలుగా మహారాష్ట్ర సెకండ్ వేవ్ తో అతలాకుతలం అవుతోంది. పుణెలో రాత్రి కర్ఫ్యూ, అమరావతి జిల్లాలో ఆంక్షలు.. ఇలా మహారాష్ట్ర మొత్తం మళ్లీ పాతరోజుల్ని గుర్తు చేస్తోంది. ఈ దశలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అనంతరం మోదీ కీలక నిర్ణయం వెళ్లడించే అవకాశం […]

Advertisement
Update:2021-03-16 03:20 IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 3నెలలుగా స్తబ్దుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది. రెండు వారాలుగా మహారాష్ట్ర సెకండ్ వేవ్ తో అతలాకుతలం అవుతోంది. పుణెలో రాత్రి కర్ఫ్యూ, అమరావతి జిల్లాలో ఆంక్షలు.. ఇలా మహారాష్ట్ర మొత్తం మళ్లీ పాతరోజుల్ని గుర్తు చేస్తోంది. ఈ దశలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అనంతరం మోదీ కీలక నిర్ణయం వెళ్లడించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అది లాక్ డౌన్ లాగా మరీ కఠినంగా ఉంటుందా, లేక ఆంక్షలకే పరిమితం అవుతారా అనేది తేలాల్సి ఉంది.

లాక్ డౌన్ విధిస్తే ఎన్నికల సంగతేంటి..?
అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అంటే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగినట్టే. దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీస్తున్న దశలో.. లాక్ డౌన్ తో ఎన్నికల యుద్ధానికి తాత్కాలికంగా మోదీ తెరదించుతారనే ప్రచారం కూడా జోరందుకుంది. లేదా ఆంక్షలు విధించి.. భారీ స్థాయిలో జరిగే ఎన్నికల ప్రచారానికి చెక్ పెడతారనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమయినా ప్రధాని రేపు నోరు తెరిస్తేనే.. అసలు విషయం బయటపడుతుంది.

దాదాపుగా మూడు నెలలుగా స్తబ్దుగా ఉన్న కరోనా కేసులు.. దేశంలో ఒక్కసారిగా విజృంభించడం ఆందోళన కలిగించే విషయం. 85 రోజుల తర్వాత దేశంలో మళ్లీ గరిష్టంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాలలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 26,291 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 118 మంది మరణించారు. దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 1,58,725కు చేరుకుంది. మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తమిళనాడు, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వైరస్ సెకండ్ వేవ్ మొదలై కేసులు పెరుగుతున్నాయి. ఈ దశలో ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్న ప్రధాని, ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారనేదే ప్రస్తుతం హాట్ టాపిక్.

Tags:    
Advertisement

Similar News