కోయంబత్తూరు సౌత్ నుంచి కమల్​..!

ప్రముఖ సినీనటుడు, మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్​ కోయంబత్తూర్​ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. ఈ మేరకు ఎంఎన్​ఎం పార్టీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కమల్ హాసన్​ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. గత ఏడాది జరిగిన పార్లమెంట్​ ఎన్నికల ముందే ఆయన మక్కల్​ నీది మయ్యం పార్టీని స్థాపించారు. కానీ అప్పట్లో పెద్దగా ప్రచారం చేయలేదు. దీంతో పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లు మాత్రం […]

Advertisement
Update:2021-03-12 15:24 IST

ప్రముఖ సినీనటుడు, మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్​ కోయంబత్తూర్​ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. ఈ మేరకు ఎంఎన్​ఎం పార్టీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
కమల్ హాసన్​ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. గత ఏడాది జరిగిన పార్లమెంట్​ ఎన్నికల ముందే ఆయన మక్కల్​ నీది మయ్యం పార్టీని స్థాపించారు. కానీ అప్పట్లో పెద్దగా ప్రచారం చేయలేదు. దీంతో పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లు మాత్రం వచ్చాయి.

అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికలను కమల్​ హాసన్​ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎంజీఆర్​ ఆశయాలను తానే కొనసాగిస్తానని.. ఎంజీఆర్​కు నిజమైన వారసుడిని తానేనంటూ ఆయన ప్రకటించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చారు. తమిళుల ఆత్మగౌరవాన్ని కాపాడేది తానేనంటూ ప్రకటించారు. ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో ప్రభావం చూపించాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అయితే.. గత పార్లమెంట్ ఎన్నికల్లో కోయంబత్తూరు నియోజకవర్గం పరిధిలో మక్కల్​ నీది మయ్యం పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ఆ నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు.

ఆయన చెన్నై నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆయన కోయంబత్తూరు సౌత్​ నుంచి పోటీచేయబోతున్నట్టు తాజాగా పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే మక్కల్​ నీది మయ్యం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా కమల్​ హాసన్​ యేనని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే), ఇందియ జయనాయగ కట్చి పార్టీలతో కలసి ఆయన పోటీచేస్తున్నారు. మొత్తం 154 స్థానాల్లో మక్కల్​ నీది మయ్యం పోటీచేస్తుండగా.. భాగస్వామ్య పక్షాలు చెరో 40 స్థానాల్లో పోటీచేయబోతున్నాయి. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్‌హాసనేనని ఏఐఎస్ఎంకే చీఫ్ శరత్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News