విజయవాడ ఎన్నికలు.. అమరావతికి రెఫరెండమా..?

సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన తర్వాత చంద్రబాబు రెఫరెండం పేరుతో హడావిడి చేశారు. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టి మరీ రెఫరెండానికి కట్టుబడాలని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా రాజీనామాలు చేయకపోయినా పర్లేదు.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మళ్లీ ఎన్నికలకు వెళ్తామంటూ ఆఫర్ ఇచ్చారు. చివరకు అవేవీ వర్కవుట్ కాకపోవడం, కనీసం జగన్ స్పందించకపోవడంతో బాబు సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు విజయవాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాబు నోట రెఫరెండం మాట వినిపించింది. విజయవాడ మున్సిపల్ […]

Advertisement
Update:2021-03-08 03:21 IST

సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన తర్వాత చంద్రబాబు రెఫరెండం పేరుతో హడావిడి చేశారు. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టి మరీ రెఫరెండానికి కట్టుబడాలని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా రాజీనామాలు చేయకపోయినా పర్లేదు.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మళ్లీ ఎన్నికలకు వెళ్తామంటూ ఆఫర్ ఇచ్చారు. చివరకు అవేవీ వర్కవుట్ కాకపోవడం, కనీసం జగన్ స్పందించకపోవడంతో బాబు సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు విజయవాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాబు నోట రెఫరెండం మాట వినిపించింది.

విజయవాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే.. మూడు రాజధానులకు మద్దతు తెలిపినట్టేనని ఉద్భోదించారు. అమరావతి రాజధానిగా ఉండాలో లేదో.. ఓటు ద్వారా చెప్పాలని ప్రజల్ని కోరారు. టీడీపీని గెలిపించినంత మాత్రాన తనకు వచ్చేదేమీ లేదని, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుందని అన్నారు. టీడీపీని గెలిపించకపోతే ఈ ప్రాంత వాసులు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండదని అన్నారు బాబు. జగన్‌ ఇక్కడే ఇల్లు కట్టుకుని, రాజధాని ఎక్కడికీపోదంటూ ప్రజల్ని నమ్మించి మోసం చేశారని, మూడు రాజధానులంటూ.. మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారణం వైసీపీ సర్కారేనంటూ విమర్శించిన చంద్రబాబు.. విజయవాడ వచ్చే సరికి అమరావతి, ఆత్మగౌరవం అంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు.

రౌడీలకే రౌడీని..
రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్ద రౌడీ అయితే.. నేను ఆ రౌడీలకే రౌడిని, వాళ్ల గుండెల్లో నిద్రపోతానంటూ చంద్రబాబు బెజవాడలో సినిమా డైలాగులు పేల్చారు. వైసీపీ ప్రభుత్వం పోవాలంటే కనకదుర్గమ్మ కన్నెర్ర చేయాలని అన్నారు. జగన్‌ కి, మంత్రులకు భయపడాల్సిన పనిలేదని, తిరగబడాల్సిన సమయం వచ్చిందని అన్నారు చంద్రబాబు. పనిలో పనిగా విజయవాడ టీడీపీలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలపై కూడా నాయకులకు చురకలంటించారు బాబు. తమ పార్టీలో నాయకులకు ప్రజాస్వామ్యం ఉంటుందని, ఈ మధ్య కొంతమందికి స్వేచ్ఛ ఎక్కువైందని, దాన్ని తాను కంట్రోల్ చేస్తానని అన్నారు. ఏదైనా శృతిమించితే తాను ఊరుకోనని అన్నారు.

Tags:    
Advertisement

Similar News