చిన్నమ్మ సంచలన నిర్ణయం ! బీజేపీ ఒత్తిడే కారణమా?

తమిళనాడు రాజకీయాలు మళ్లీ ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో ప్రభావం చూపుతారని అనుకున్న శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఆమె నిర్ణయం ఇప్పుడు సంచలనమైంది. అన్నాడీఎంకే కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడాలని శశికళ పిలుపునిచ్చారు. జయలలిత పార్టీ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు లేఖలో తెలిపారు. జయలలిత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేయాలని పార్టీ కేడర్‌ను కోరారు. చిన్నమ్మ సంచలన నిర్ణయానికి కారణాలేంటి? అనే విషయంపై తమిళనాడులో జోరుగా చర్చ […]

Advertisement
Update:2021-03-04 02:22 IST

తమిళనాడు రాజకీయాలు మళ్లీ ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో ప్రభావం చూపుతారని అనుకున్న శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఆమె నిర్ణయం ఇప్పుడు సంచలనమైంది.

అన్నాడీఎంకే కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడాలని శశికళ పిలుపునిచ్చారు. జయలలిత పార్టీ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు లేఖలో తెలిపారు. జయలలిత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేయాలని పార్టీ కేడర్‌ను కోరారు.

చిన్నమ్మ సంచలన నిర్ణయానికి కారణాలేంటి? అనే విషయంపై తమిళనాడులో జోరుగా చర్చ సాగుతోంది. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు కుదిరింది. రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ టైమ్‌లో జైలు నుంచి శశికళ విడుదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చక్రం తిప్పుతారని అందరూ ఆశించారు. బెంగళూరు నుంచి ర్యాలీగా వచ్చినప్పుడు ఆమె పొలిటికల్ ప్రయారిటీస్‌ కనిపించాయి. ఈలోపు అమిత్‌షా నుంచి అన్నాడీఎంకే పెద్ద‌ల‌కు ఆదేశాలు వచ్చాయి. శశికళను పార్టీలోకి తీసుకోవాలని కోరారు. అయితే పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.

అన్నాడీఎంకేలోకి శశికళ రీఎంట్రీ ఇస్తే ఇబ్బందులు ఉంటాయని.. ఆమె వల్ల పార్టీకి నష్టమే అనే సంకేతాలు బీజేపీ పెద్దలకు పంపారట. ఆమెను పార్టీ బయటే ఉంచాలని కోరారట. మొత్తానికి ఆమెను పార్టీలోకి తీసుకువచ్చి చక్రం తిప్పాలని అనుకున్న బీజేపీ పెద్దలు..ఇప్పుడు ఆమెతో రాజీ ప్రకటన చేశారని అంటున్నారు. డీఎంకేను దెబ్బ కొట్టేందుకు ఎన్నికల ముందు శశికళ జైలు నుంచి తీసుకువచ్చారు. ఆమె రాకతో అన్నాడీఎంకే కలిసివస్తుందా? ఆమె ప్రకటనను తమిళ ప్రజలు పట్టించుకుంటారా? రెండాకులు, కమలం కలిసి అధికారంలోకి వస్తాయా? అనేది రాబోయే ఎన్నికలే తేల్చాలి.

Tags:    
Advertisement

Similar News