బెంగాల్​లో లెఫ్ట్​తో కుదిరిన బేరం.. కాంగ్రెస్​కు 92 సీట్లు

పశ్చిమబెంగాల్​లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్.. బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఈ సారి ఎలాగైనా పట్టునిలుపుకోవాలని వామపక్షపార్టీలు సైతం వ్యూహాలు రచిస్తున్నాయి. సుధీర్ఘకాలం పాటు పశ్చిమబెంగాల్​లో అధికారంలో ఉన్న సీపీఎం.. కొన్ని స్వీయ తప్పిదాలతో బెంగాల్​లో పట్టును కోల్పోయింది. కీలకనేతలు ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. కానీ ఆ పార్టీకి బలమైన క్యాడర్​ మాత్రం అలాగే ఉంది. ఇదిలా ఉంటే ఈ సారి వామపక్షాలు, కాంగ్రెస్​ కూటమిగా […]

Advertisement
Update:2021-03-02 09:21 IST

పశ్చిమబెంగాల్​లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్.. బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఈ సారి ఎలాగైనా పట్టునిలుపుకోవాలని వామపక్షపార్టీలు సైతం వ్యూహాలు రచిస్తున్నాయి. సుధీర్ఘకాలం పాటు పశ్చిమబెంగాల్​లో అధికారంలో ఉన్న సీపీఎం.. కొన్ని స్వీయ తప్పిదాలతో బెంగాల్​లో పట్టును కోల్పోయింది. కీలకనేతలు ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు.

కానీ ఆ పార్టీకి బలమైన క్యాడర్​ మాత్రం అలాగే ఉంది. ఇదిలా ఉంటే ఈ సారి వామపక్షాలు, కాంగ్రెస్​ కూటమిగా పోటీచేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి.. 92 స్థానాలు కేటాయించారు. మిగిలిన 202 స్థానాల్లో వామపక్షాలు పోటీచేయబోతున్నాయి. సీట్ల సర్దుబాటుపై చాలా కాలం పాటు చర్చలు జరిగాయి..

బెంగాల్​లో ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్​ నేత అధిర్​ రంజన్​ చౌదురి మీడియాతో మాట్లాడుతూ.. ‘వామపక్షాలతో కాంగ్రెస్​ పార్టీ సీట్ల సర్దుబాటు ఫైనల్ అయ్యింది. మొత్తం 92 స్థానాల్లో మేము పోటీచేయబోతున్నాం. త్వరలోనే జాబితాను విడుదలచేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 92 స్థానాల్లోనే పోటీ చేసింది. అయితే వామపక్ష పార్టీల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. 202 స్థానాల్లో పోటీ చేసిన వామపక్షాలు కేవలం 35 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో గెలుపొంది బెంగాల్‌లో ప్రతిపక్షంగా అవతరించింది.

తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తమకు గతంలో కంటే ఎక్కువ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ అందుకు వామపక్షాలు ఒప్పుకోలేదు.ఇదిలా ఉంటే ఈ సారి పరిస్థితులు తారుమారాయ్యాయి.బెంగాల్​లో బీజేపీ బలం పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News