దీదీని కలిసిన తేజస్వియాదవ్.. బీహారీలంతా దీదీవైపేనా?
త్వరలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయపరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మళ్లీ పగ్గాలు చేపట్టబోయేది దీదీయే నంటూ పలు సర్వేలు తేల్చిచెప్పాయి. అయితే బీజేపీకి గతం కంటే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వేల్లో తేలింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకున్నది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే […]
త్వరలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయపరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మళ్లీ పగ్గాలు చేపట్టబోయేది దీదీయే నంటూ పలు సర్వేలు తేల్చిచెప్పాయి. అయితే బీజేపీకి గతం కంటే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వేల్లో తేలింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకున్నది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది.
అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే మమతా కూడా వ్యూహాలకు పదునుపెడుతున్నది. మరోవైపు ఆమెకు ఐప్యాక్ సంస్థ నిర్వాహకుడు, ప్రశాంత్‌కిశోర్ అతడి టీం సలహాలు ఇస్తున్నది. ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని.. ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ కలిశారు. బీహారీలంతా మమతేకే మద్దతు ఇవ్వాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారు. బీజేపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. తేజస్వి యాదవ్ పిలుపుతో కొన్నివర్గాల ప్రజలు దీదీకి మద్దతు తెలపవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
రాబోయే ఎన్నికలు ‘‘ఆదర్శాలు, విలువలను కాపాడుకునేందుకే’’నని తేజస్వి చెప్పారు. ‘‘మా పార్టీ మమతా బెనర్జీకి సంపూర్ణ మద్దతు తెలుపుతోంది’’ అని తేజస్వియాదవ్ పేర్కొన్నారు. మరోవైపు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) 28 మంది పరిశీలకులను బెంగాల్‌కు పంపించింది. బెంగాల్‌లో జరుగుతున్న రాజకీయాలపై వాళ్లు అధ్యయనం చేస్తున్నారు. అయితే పశ్చిమబెంగాల్లో 8 విడతల్లో ఎన్నికలు జరపడాన్ని కాంగ్రెస్ తప్పుపడుతున్నది.
ఈ మేరకు ప్రముఖ న్యాయవాది ఎంఎల్.శర్మ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. పశ్చిమ బెంగాల్‌లో 8 విడతలుగా ఎన్నికలు జరపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21కి వ్యతిరేకమని ఆయన వాదిస్తున్నారు.