స్పేస్‌లోకి మోదీ ఫొటో, భగవద్గీత..
ఇప్పటివరకూ ఎన్నో శాటిలైట్లు నింగిలోకి వెళ్లాయి. కానీ, ఈనెల చివర్లో (ఫిబ్రవరి 28వ తేదీ) నింగికెళ్లబోతున్న ఓ ప్రైవేట్ శాటిలైట్ మాత్రం కొంచెం ప్రత్యేకం. ఎందుకంటే ఇది ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతోపాటు ఓ భగవద్గీత కాపీని, 25 వేల మంది పేర్లను అంతరిక్షంలోకి మోసుకుపోనుంది. ఈ శాటిలైట్ విశేషాలేంటంటే.. పిల్లల్లో స్పేస్ సైన్స్ ను ప్రోత్సహించే స్పేస్ కిడ్జ్ ఇండియా (SpaceKidz india) సంస్థ.. ఓ శాటిలైట్ ను రూపొందించింది. ఈ శాటిలైట్ కు సతీష్ […]
ఇప్పటివరకూ ఎన్నో శాటిలైట్లు నింగిలోకి వెళ్లాయి. కానీ, ఈనెల చివర్లో (ఫిబ్రవరి 28వ తేదీ) నింగికెళ్లబోతున్న ఓ ప్రైవేట్ శాటిలైట్ మాత్రం కొంచెం ప్రత్యేకం. ఎందుకంటే ఇది ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతోపాటు ఓ భగవద్గీత కాపీని, 25 వేల మంది పేర్లను అంతరిక్షంలోకి మోసుకుపోనుంది. ఈ శాటిలైట్ విశేషాలేంటంటే..
పిల్లల్లో స్పేస్ సైన్స్ ను ప్రోత్సహించే స్పేస్ కిడ్జ్ ఇండియా (SpaceKidz india) సంస్థ.. ఓ శాటిలైట్ ను రూపొందించింది. ఈ శాటిలైట్ కు సతీష్ ధావన్ లేదా ఎస్‌డీ శాట్ అనే పేరు పెట్టారు. దీన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్‌వీ) ద్వారా అంతరిక్షంలోకి పంపించనున్నారు.
ఈ శాటిలైట్ మరో మూడు పేలోడ్స్‌ను కూడా తీసుకెళ్లనుంది. ఇందులో ఒక పేలోడ్ స్పేస్ రేడియేషన్‌ను, ఒకటి మాగ్నెటోస్పియర్‌ను స్టడీ చేయనుండగా.. మరొకటి లోపవర్ వైడ్ ఏరియా కమ్యూనికేషన్ నెట్‌వర్క్ కోసం పనిచేస్తుంది.
ఈ శాటిలైట్ నింగిలోకి వెళ్తుండడం చాలా ఎక్సయింటిగ్ గా ఉందని స్పేస్ కిడ్జ్ ఇండియా సీఈవో డాక్టర్ శ్రీమతి కేశన్ చెప్పారు. “స్పేస్‌లోకి మా తొలి శాటిలైట్ ను పంపాలనుకున్నప్పుడు.. పేర్లు పంపించాల్సిందిగా ప్రజలను కోరాము. వారంలోనే 25 వేల మంది పేర్లు వచ్చాయి. ఈ పేర్లతోపాటు ప్రధాని మోదీ ఫొటోను, ఓ భగవద్గీత కాపీని కూడా పంపుతున్నాము” అని కేశన్ అన్నారు. ఇప్పటికే పేర్లు పంపిన వారికి బోర్డింగ్ పాస్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ పేర్లలో ఇస్రో చైర్‌పర్శన్ కేశవన్, సైంటిఫిక్ సెక్రటరీ ఉమామహేశ్వరమ్ పేర్లు కూడా ఉన్నట్లు చెప్పారు.