కిడ్నీలో రాళ్లు కరగాలంటే..

రోజూ మనం తీసుకునే శరీరంలో ఎన్నో వ్యర్థాలుంటాయి. వాటన్నింటినీ క్లీన్ చేసి ఫిల్టర్ చేసేది కిడ్నీ.. మరి అలాంటిది కిడ్నీలోనే వ్యర్థాలుంటే. అప్పుడేం చేయాలి. ఈ రోజుల్లో చాలామందికి కిడ్నీలో రాళ్లు చాలా కామన్ ప్రాబ్లమ్ గా మారింది. మారిన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ దీనికి కారణం. కిడ్నీలో రాళ్లు కరిగించేందుకు కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి. అవేంటంటే.. అధిక మోతాదులో ఆక్జలేట్స్‌, కాల్షియం, యూరిక్‌ యాసిడ్‌, సిస్టీన్‌ వంటి కరగని పదార్థాలు తీసుకోవడం, వాటిని […]

Advertisement
Update:2021-02-14 10:04 IST

రోజూ మనం తీసుకునే శరీరంలో ఎన్నో వ్యర్థాలుంటాయి. వాటన్నింటినీ క్లీన్ చేసి ఫిల్టర్ చేసేది కిడ్నీ.. మరి అలాంటిది కిడ్నీలోనే వ్యర్థాలుంటే. అప్పుడేం చేయాలి. ఈ రోజుల్లో చాలామందికి కిడ్నీలో రాళ్లు చాలా కామన్ ప్రాబ్లమ్ గా మారింది. మారిన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ దీనికి కారణం. కిడ్నీలో రాళ్లు కరిగించేందుకు కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి. అవేంటంటే..

అధిక మోతాదులో ఆక్జలేట్స్‌, కాల్షియం, యూరిక్‌ యాసిడ్‌, సిస్టీన్‌ వంటి కరగని పదార్థాలు తీసుకోవడం, వాటిని ఫిల్టర్ చేయలేక కిడ్నీ ఇబ్బంది పడినప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కొంతమందికి.. మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌లు, మూత్రమార్గంలో అడ్డంకులు, హైపర్‌ పారా థైరాయిడిజమ్‌, ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని పనిచయడం, విటమిట్‌ -ఏ లోపం లాంటివి కూడా కారణమవ్వొచ్చు.
వీటితో పాటు.. ప్రొటీన్స్, సోడియం ఎక్కువగా తీసుకోవడం. నీళ్లు తక్కువగా తాగడం, ఆస్ర్పిన్‌, ఆంటాసిడ్స్‌,విటమిన్‌ -సి వంటి కొన్ని మందులు ఎక్కువగా తీసుకోవడం లాంటి కారణాల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

కిడ్నీల్లో రాళ్లు వచ్చినప్పుడు యూరిన్ కు వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే రాళ్లు కరగాలంటే.. వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. కనీసం రోజుకు నాలుగు లీటర్ల నీటినైనా తాగాలి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్లాటింగ్ కణాలు ఉంటాయి. ఇవి కిడ్నీకి మేలు చేస్తాయి. అలాగే మొలకెత్తిన విత్తనాలు కూడా కిడ్నీల్లో రాళ్లను కరిగించడంలో సాయపడతాయి.

స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, బ్లూబెర్రీస్ లాంటి ఫ్రూట్స్ లో ఉండే యాంటీఇన్‌ప్లమేటరి క్వాలిటీస్.. కిడ్నీలో రాళ్లను కరిగించడానికి సాయపడతాయి. అలాగే నిమ్మ రసం, దానిమ్మ రసాన్ని తరచూ తీసుకోవడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను బయటకు పంపొచ్చు. ఇకపోతే భోజనానికి ఆరగంట ముందు ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే ఎంతో మంచిది. విటమిన్‌ సి, కాల్షియం సప్లిమెంట్‌లు వైద్యుని సలహా లేకుండా తీసుకోకూడదు.

Tags:    
Advertisement

Similar News