ప్రభాస్ ప్రేమికుల రోజు గిఫ్ట్

పూర్తి నిడివి లవ్ స్టోరీగా వస్తోంది రాధేశ్యామ్ మూవీ. కాబట్టి రాబోయే ప్రేమికుల రోజుకు ఈ సినిమా నుంచి కచ్చితంగా ఏదో ఒక అప్ డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. అది ఇప్పుడు నిజమైంది. యూవీ క్రియేషన్స్ నుంచి అప్ డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా రాధేశ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేటర్ చెప్పడం కోసం ఈరోజు రిలీజ్ చేసిన చిన్న వీడియో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే ఈ […]

Advertisement
Update:2021-02-06 13:26 IST

పూర్తి నిడివి లవ్ స్టోరీగా వస్తోంది రాధేశ్యామ్ మూవీ. కాబట్టి రాబోయే ప్రేమికుల రోజుకు ఈ సినిమా నుంచి
కచ్చితంగా ఏదో ఒక అప్ డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. అది ఇప్పుడు నిజమైంది. యూవీ
క్రియేషన్స్ నుంచి అప్ డేట్ వచ్చేసింది.

ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా రాధేశ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేటర్
చెప్పడం కోసం ఈరోజు రిలీజ్ చేసిన చిన్న వీడియో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే ఈ ప్రకటన వెనక
చాలా పెద్ద కథ నడిచింది. ఏకంగా యూవీ క్రియేషన్స్ పై ట్రోలింగ్ నడిచింది.

యూవీ నిర్మాతలు గ్లింప్స్ గురించి ప్రకటించడాని కంటే ముందే అది కాస్తా నెట్ లో లీక్ అయింది.
చాలామంది దాన్ని చూసేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య యూనిట్ వెంటనే ప్రకటన
ఇచ్చేసింది. అలా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మరోసారి ట్రోల్ జరిగింది.

మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ ఫీలవుతున్నారు. ఇన్నాళ్లకు తమ హీరో సినిమాకు సంబంధించి
అప్ డేట్ ఇచ్చినందుకు వాళ్లు పండగ చేసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News