రహదారుల దిగ్బంధానికి సిద్ధమవుతున్న రైతులు " నిఘా పెంచిన పోలీసులు

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళన రోజురోజుకూ ఉధృతమవుతోంది. రిపబ్లిక్ డే పరిణామాల తరువాత రైతు ఆందోళనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. రైతు నేతలపై కేసులు మోపడంతో పాటు, వంద మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకదశలో రైతు దీక్షా శిబిరాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. బలవంతంగానైనా నిరసన స్థలాల నుంచి రైతులను గెంటేయాలనుకున్నది ప్రభుత్వం. కానీ.. రైతు ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించడంతో, గ్రామల నుంచి […]

Advertisement
Update:2021-02-06 06:40 IST

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళన రోజురోజుకూ ఉధృతమవుతోంది. రిపబ్లిక్ డే పరిణామాల తరువాత రైతు ఆందోళనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. రైతు నేతలపై కేసులు మోపడంతో పాటు, వంద మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకదశలో రైతు దీక్షా శిబిరాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. బలవంతంగానైనా నిరసన స్థలాల నుంచి రైతులను గెంటేయాలనుకున్నది ప్రభుత్వం. కానీ.. రైతు ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించడంతో, గ్రామల నుంచి లక్షలాదిగా ఢిల్లీ సరిహద్దులకు వచ్చిచేరడంతో తన ఆలోచనను విరమించుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశ వ్యాప్త రహదారుల దిగ్బంధానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రహదారులు దిగ్బంధించాలని రైతులు నిర్ణయించారు.

రహదారుల దిగ్బంధం నేపథ్యంలో పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లోని రైతు శిబిరాల చుట్టూ ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. రహదారులపై ఇనుప మేకులను నాటారు. కాగా.. ప్రభుత్వ చర్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం రైతులను శత్రువులుగా చూస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నిరసన స్థలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడాన్ని పలువురు అంతర్జాతీయ సెలబ్రెటీలు తప్పుబట్టారు. రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

మరోవైపు రహదారుల దిగ్బంధం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసనల నేపథ్యంలో అసాంఘీక శక్తులు రెచ్చిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన హింసను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. నిరసన స్థలాల నుంచి రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా రహదారులపై కందకాలు తవ్వారు. అదనపు బలగాను రంగంలోకి దింపి అణువణువూ పరిశీలిస్తున్నారు పోలీసులు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలు హర్యానా, ఉత్తరప్రదేశ్ గుండా వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, దుష్ప్ర‌చారం చేసే పోస్టులు చేసేవారిపై నిఘా పెట్టామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తపడుతున్నామన్నారు. మరోవైపు.. నిరసన శిబిరాల చుట్టూ పోలీసులు నాటిన ఇనుమ మేకులను రైతులు తొలగించారు. ఇనుమ మేకులు తీసేసి.. పూల‌మొక్క‌లు నాటారు రైతులు. మీరెన్ని ప్రయత్నాలుచేసినా మేము వెనక్కితగ్గమంటూ రైతు సంఘాల నేతలు ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News