ఈమె స్ట్రాబెరీకి బ్రాండ్ అంబాసిడర్

ఆమె పేరు గుర్లీన్ చావ్లా.. కానీ మోదీ నుంచి కామన్ మ్యాన్ వరకూ ఆమెను స్ట్రాబెరీ గర్ల్ అంటున్నారు. ఇంతకీ ఎవరీ గుర్లీన్.. ఆమె స్ట్రాబెరీ గర్ల్ ఎలా అయింది? ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడి వాతావరణ పరిస్థితులు అన్నీ పంటలకు అంతగా సూట్ అవ్వవు. అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ. నీళ్లు తక్కువ. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నూతన విధానాలు అవలంభించి స్ట్రాబెరీ పంటను పండించి సక్సెస్ అయింది. గుర్లిన్ […]

Advertisement
Update:2021-02-03 09:51 IST

ఆమె పేరు గుర్లీన్ చావ్లా.. కానీ మోదీ నుంచి కామన్ మ్యాన్ వరకూ ఆమెను స్ట్రాబెరీ గర్ల్ అంటున్నారు. ఇంతకీ ఎవరీ గుర్లీన్.. ఆమె స్ట్రాబెరీ గర్ల్ ఎలా అయింది?

ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడి వాతావరణ పరిస్థితులు అన్నీ పంటలకు అంతగా సూట్ అవ్వవు. అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ. నీళ్లు తక్కువ. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నూతన విధానాలు అవలంభించి స్ట్రాబెరీ పంటను పండించి సక్సెస్ అయింది. గుర్లిన్ చావ్లా. లా చదువుతున్న 23 ఏళ్ల గుర్లిన్‌ లాక్‌డౌన్‌లో బుందేల్ ఖండ్ వచ్చి ఖాళీగా ఉండకుండా.. స్ట్రాబెరీ పంట పండించి సక్సెస్ అవ్వడమే కాకుండా.. రైతులకు కూడా గైడెన్స్ ఇస్తోంది.
మామూలుగా స్ట్రాబెర్రీ 35 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర పండదు. నీటి వసతి కచ్చితంగా ఉండాలి. అయితే బుందేల్‌ఖండ్‌లో ఉష్ణోగ్రత ఎక్కువే.. పైగా నీటి కొరత.. అయినా సరే.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని గుర్లిన్‌ స్ట్రాబెరీ పండించి సక్సెస్ అయింది.

ఇలా మొదలైంది..
పూనెలో లా చదువుతున్న గుర్లిన్ చావ్లా లాక్‌డౌన్‌లో ఇంటికొచ్చింది. ఇంట్లో తన తండ్రి టెర్రస్‌ మీద ఆర్గానిక్‌ పద్ధతిలో కూరగాయలు పండించడం చూసి.. ఇదేదో బాగుంది అనుకుంది. తను కూడా ఇలాంటి పద్ధతిలో ఏదైనా పంట పండించాలి అనుకుంది. రసాయనాలు వాడకుండా తాజా కూరగాయలు ఎలా పండించాలో తెలుసుకుంది. ఒకరోజు 20 స్ట్రాబెర్రీ మొలకలను తెచ్చి తన ఇంటి డాబా మీద ఉన్న తోటలో నాటింది. వాళ్ల నాన్న.. “స్ట్రాబెరీలు ఇక్కడ పండవు.. ఈ మొక్కలు బతకలేవు” అని చెప్పాడి. కాని పట్టు పట్టి వాటిని పెంచింది. ఆ మొక్కలు బతికాయి. ఇంకా ఆశ్చర్యంగా కాయలు కూడా కాశాయి. ఇదే పంటను పొలంలో ఎందుకు పండించకూడదు అనుకుంది. ఆ ఐడియా తండ్రితో చెప్పింది. ఆయన ఆ పంట ఇక్కడ పండదు.. వద్దు అని చెప్పాడు. లేదు నేను పండించి చూపిస్తాను అని మొండికేయడంతో తండ్రికూడా కాదనలేకపోయాడు.

రైతులకు గైడెన్స్
గుర్లిన్ తండ్రికి నాలుగున్నర ఎకరాల పొలం ఉంది. ఎలాగూ ఖాళీగా ఉంది కదా అని.. ఓకే అన్నాడు. అంతే.. 2020 అక్టోబర్‌ నెలలో సేంద్రియ పద్ధతి ద్వారా ఒకటిన్నర ఎకరంలో స్ట్రాబెర్రీ పంట వేసింది.అది చూసి అక్కడి రైతులు కూడా ఈ పంట ఎలా పండుతుందా అని ఆశ్చర్యపోయారు. పండదని తేల్చి చెప్పేశారు. కానీ వ్యవసాయంలో కొత్త విధానాలను అనుసరించి ఎలాగొలా కష్టపడి పంట పండించింది గుర్లిన్. అలా జనవరి నెల వచ్చేసరికి స్ట్రాబెర్రీని పంట చేతికొచ్చింది. పంట చేతికి రావడంతో అక్కడి రైతులందరూ.. గుర్లిన్ ను మెచ్చుకున్నారు. గుర్లిన్ రైతులకు కూడా వ్యవసాయంలో కొత్త విధానాలను, సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్ని చెప్పి గైడెన్స్ ఇచ్చింది.

స్ట్రాబెరీ అంబాసిడర్
జనవరి 16 నుంచి బుందేల్ ఖండ్ లోని ఝాన్సీలో “స్ట్రాబెర్రీ ఫెస్టివల్‌” జరుగుతోంది. ఆ ప్రాంతంలో స్ట్రాబెర్రీని ప్రోత్సహించడం కోసం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ గుర్లిన్‌ను ‘స్ట్రాబెర్రీ అంబాసిడర్‌’గా ప్రకటించారు. అంతే కాదు ప్రధాని మోదీ కూడా మన్‌ కీ బాత్‌లో గుర్లిన్‌ను ప్రస్తావించారు. గుర్లీన్‌ చావ్లా.. బుందేల్‌ఖండ్‌ ఆశాజ్యోతి అన్నారు. అలా గుర్లిన్.. స్ట్రాబెరీ గర్ల్ అయింది. రైతులకు, యువతకు మంచి ఇనిస్పిరేషన్ గా నిలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News