తెలంగాణ ఉద్యోగులకు నిరాశే.. ఫిట్‌మెంట్ 7.5 శాతమే

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి వేతన సవరణ ఎట్టకేలకు జరుగబోతున్నది. వేతన సవరణ కోసం వేసిన బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రభుత్వం వద్దకు చేరింది. దాన్నికాసేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో పలు అంశాలపై సూచనలు చేసిన కమిటీ.. నివేదికను పూర్తి చేసింది. దీనిపై ఈ రోజు సాయంత్రం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఉద్యోగులు ఆశించిన మేరకు ఫిట్‌మెంట్ ప్రతిపాదంచలేదు. కేవలం 7.5 శాతానికి పరిమితం […]

Advertisement
Update:2021-01-27 07:40 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి వేతన సవరణ ఎట్టకేలకు జరుగబోతున్నది. వేతన సవరణ కోసం వేసిన బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రభుత్వం వద్దకు చేరింది. దాన్నికాసేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో పలు అంశాలపై సూచనలు చేసిన కమిటీ.. నివేదికను పూర్తి చేసింది. దీనిపై ఈ రోజు సాయంత్రం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఉద్యోగులు ఆశించిన మేరకు ఫిట్‌మెంట్ ప్రతిపాదంచలేదు. కేవలం 7.5 శాతానికి పరిమితం చేయాలని నివేదికలో సూచించింది. ఉద్యోగులు 60 శాతానికి పైగా ఫిట్‌మెంట్ కోరుతున్నారు. కానీ కమిటీనే 7.5 శాతం ప్రతిపాదిస్తే.. ప్రభుత్వం ఎంతకు పరిమితం చేస్తుందో తెలియని పరిస్థితి.

మరోవైపు ఇంక్రిమెంట్‌ను ప్రతీ మూడేళ్లకు ఒకసారి 2.33 శాతం చేయాలని సూచించింది. అయితే ఉద్యోగులు 2.36 శాతం అడగటం గమనార్హం. అయితే పదవీ విరమణ వయస్సును మాత్రం 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలనే సూచన ఉద్యోగులకు ఊరట కల్గించనున్నది. కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో హెచ్ఆర్ఏ పెంచాలని ఉద్యోగులు కోరినా.. కమిషన్ మాత్రం తగ్గిస్తూ సూచనలు చేసింది. గతంలో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌లో గ్రాట్యుటీగా రూ. 12 లక్షలు చెల్లిస్తుండగా.. దాన్ని రూ. 16 లక్షలకు పెంచారు. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు చనిపోతే అంత్యక్రియల ఖర్చుగా రూ. 30 వేల చెల్లించాలని నివేదికలో పేర్కొన్నారు.

ఇక చైల్డ్ కేర్ లీవ్స్‌ను ప్రస్తుతం మూడు నెలలు ఇస్తుండగా.. వాటిని నాలుగు నెలలకు పెంచేందుకు ప్రతిపాదించారు. అంగవైకల్యం ఉంటే రెండేళ్ల సెలవు వర్తింపజేస్తూ మొదటి ఏడాది 100 శాతం వేతనం, రెండో ఏడాది 80 శాతం వేతనం చెల్లించాలని సూచించారు. ఇక టీఏ విషయానికి వస్తే ఆర్టీసీ, ప్రైవేటు ఏసీ బస్సుల్లో ప్రయాణానికి వీలు కల్పించాలని ప్రతిపాదించారు.

కాగా, తొలి పీఆర్సీలో ఉద్యోగులకు ఫిట్‌మెంట్ విషయంలోనే అసంతృప్తి నెలకొన్నది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌తో చర్చించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. కనీసం 30 శాతం ఫిట్‌మెంట్ అయితే ఒప్పుకోవాలని భావిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం సీఎస్‌తో భేటీ అనంతరం స్పష్టత రాకపోతే తప్పకుండా సీఎంను కలవాలని నిర్ణయించినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News