జగన్‌ సర్కార్‌లో శ్రీలక్ష్మికి కీలక పోస్ట్‌ !

ఏపీ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్య నాథ్ దాస్‌ నియమితులయ్యారు. ఈ నెల 31న ఆయన పదవీబాధ్యతులు చేపడుతారు. 1961లో బీహార్‌లో పుట్టిన ఆదిత్యనాథ్‌ దాస్‌ 1987 కేడర్‌ ఐఏఎస్‌. 1999లో వరంగల్‌ కలెక్టర్‌గా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మేడారం గ్రామంలో గిరిజన గుడిసెలన్నింటికీ శాశ్వత మంచినీటి సరఫరా నల్లాలు ఏర్పాటు చేయడంలో కలెక్టర్‌గా ఆదిత్యనాథ్‌ దాస్ కృషి మరువలేనిది. ఏటూరు నగరం దగ్గర ఆదిత్యనాథ్‌పై అప్పటి పీపుల్స్‌వార్‌ గ్రూపు నక్సలైట్లు […]

Advertisement
Update:2020-12-23 02:37 IST

ఏపీ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్య నాథ్ దాస్‌ నియమితులయ్యారు. ఈ నెల 31న ఆయన పదవీబాధ్యతులు చేపడుతారు. 1961లో బీహార్‌లో పుట్టిన ఆదిత్యనాథ్‌ దాస్‌ 1987 కేడర్‌ ఐఏఎస్‌. 1999లో వరంగల్‌ కలెక్టర్‌గా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

మేడారం గ్రామంలో గిరిజన గుడిసెలన్నింటికీ శాశ్వత మంచినీటి సరఫరా నల్లాలు ఏర్పాటు చేయడంలో కలెక్టర్‌గా ఆదిత్యనాథ్‌ దాస్ కృషి మరువలేనిది. ఏటూరు నగరం దగ్గర ఆదిత్యనాథ్‌పై అప్పటి పీపుల్స్‌వార్‌ గ్రూపు నక్సలైట్లు పొరపాటున కాల్పులు జరిపారు.

కొత్త సీఎస్‌తో పాటు ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి జగన్‌ సర్కార్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్‌ శాఖ కార్యదర్శిగా నియమించారు. 1988బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి ఓబులాపురం గనుల కేసులో రెండేళ్ల పాటు జైలులో ఉన్నారు. దీంతో ఆమెను సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత ఎత్తివేశారు. ఏపీ విభజన తర్వాత ఆమె తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.

అయితే వారం కిందటే ఆమెను ఏపీకి కేటాయిస్తూ క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ నుంచి రిలీవ్‌ అయిన ఆమె ఏపీ కేడర్‌కు వెళ్లారు. ఆమెకు మున్సిపల్‌ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.

Advertisement

Similar News