దసరాకు ముందే ఏపీ స్కూళ్లలో పండగ వాతావరణం

బడులు తెరవక ముందే ఏపీ స్కూళ్లలో పండుగ వాతావరణం వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా, పిల్లలు స్కూళ్లకు వచ్చేందుకు ప్రోత్సహించేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది జగన్‌ సర్కార్‌. జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకునే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కిట్‌ అందిస్తోంది. జగనన్న విద్యా కానుక పథకాన్ని కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడులో సీఎం జగన్‌ ప్రారంభించారు. దాదాపు 43 లక్షల మంది విద్యార్థుల కోసం 650 కోట్ల రూపాయలను […]

Advertisement
Update:2020-10-08 08:40 IST

బడులు తెరవక ముందే ఏపీ స్కూళ్లలో పండుగ వాతావరణం వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా, పిల్లలు స్కూళ్లకు వచ్చేందుకు ప్రోత్సహించేలా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది జగన్‌ సర్కార్‌. జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకునే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కిట్‌ అందిస్తోంది.

జగనన్న విద్యా కానుక పథకాన్ని కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడులో సీఎం జగన్‌ ప్రారంభించారు. దాదాపు 43 లక్షల మంది విద్యార్థుల కోసం 650 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ప్రభుత్వం.

విద్యార్థులకు అందించే ప్రతి కిట్‌లోనూ ఏడు రకాల వస్తువులు ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫామ్స్‌ ఇస్తున్నారు. నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు. ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు ఇస్తున్నారు. వీటన్నింటినీ కలిపి ఒక బ్యాగ్‌లో పెట్టి అందిస్తున్నారు. బాలికలకు స్కై బ్లూ, బాలురకు నేవీ బ్లూ బ్యాగ్‌లు అందజేస్తున్నారు.

కరోనా కారణంతో స్కూళ్లలో అన్ని జాగ్రత్తలు తీసుకుని కిట్‌ల పంపిణీ చేస్తున్నారు. వారం రోజుల్లో అందరికీ పంపిణీ చేస్తారు. స్కూళ్లు తెరిచే లోపు డ్రెస్‌లు కుట్టించుకునేందుకు కుట్టు కూలీ కూడా ఇస్తారు.

Advertisement

Similar News