ఫిట్ నెస్ విషయంలో విశాల్ కే సవాల్ విసురుతున్నాడు....

రీసెంట్ గా విశాల్ తండ్రి జీకే రెడ్డి కరోనా బారిన పడ్డారు. 82 ఏళ్ల వయసున్న ఆయనకు పాజిటివ్ అని తెలిసిన వెంటనే అంతా కంగారుపడ్డారు. కానీ ఆయన కరోనా నుంచి సక్సెస్ ఫుల్ గా బయటపడ్డారు. ఇప్పుడు మళ్లీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. తను ఫిట్ గా ఉన్నానంటూ జీకే రెడ్డి తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే, 8 పదుల వయసులో కూడా ఆయన తన కండలు చూపిస్తూ ఫొటోలకు […]

Advertisement
Update:2020-09-18 09:00 IST

రీసెంట్ గా విశాల్ తండ్రి జీకే రెడ్డి కరోనా బారిన పడ్డారు. 82 ఏళ్ల వయసున్న ఆయనకు పాజిటివ్ అని తెలిసిన వెంటనే అంతా కంగారుపడ్డారు. కానీ ఆయన కరోనా నుంచి సక్సెస్ ఫుల్ గా బయటపడ్డారు. ఇప్పుడు మళ్లీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. తను ఫిట్ గా ఉన్నానంటూ జీకే రెడ్డి తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే, 8 పదుల వయసులో కూడా ఆయన తన కండలు చూపిస్తూ ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు మరి.

మొదట్నుంచి జీకే రెడ్డికి ఫిట్ నెస్ పై ఫోకస్ ఎక్కువ. ఆయన చేసేది గ్రానైట్ బిజినెస్ అయినప్పటికీ.. రెడ్డికి ప్రత్యేకంగా ఫిట్ నెస్ సెంటర్ కూడా ఉంది. తన జిమ్ కు వచ్చే వాళ్లకు ఇప్పటికీ ఆయన ట్రయినింగ్ ఇస్తుంటారు. ఫిట్ నెస్ అంతే అంత ఇంట్రెస్ట్ ఆయనకి. అదే లక్షణం కొడుకు విశాల్ కు కూడా వచ్చినట్టుంది.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా 82 ఏళ్ల జీకే రెడ్డి వ్యాయామం విడిచిపెట్టలేదు. అంతేకాదు.. ఎలాంటి ఎక్సర్ సైజులు చేస్తే మంచిదో చెబుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

Advertisement

Similar News