వీర్రాజు టీమ్‌లో ఆ నలుగురు ?

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన టీమ్‌ ప్రకటన ఎప్పుడు? ఆయన కార్యవర్గంలో ఎవరికి స్థానం కల్పిస్తారు? ఆయన టీమ్‌లో ఎవరికి చోటు ఇస్తారు? టీమ్‌ ఎంపికతో ఎలాంటి సంకేతాలు పంపుతారు? అని అందరూ ఎదరు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో సోము వీర్రాజు కూడా తనదైన టీమ్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త కార్యవర్గంలో ప్రాంతాలు, సామాజికవర్గ సమీకరణాలు, బీజేపీతో దశాబ్దాల అనుబంధం ఉన్న నేతల్ని తీసుకునేందుకు సోము […]

Advertisement
Update: 2020-09-06 21:56 GMT

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన టీమ్‌ ప్రకటన ఎప్పుడు? ఆయన కార్యవర్గంలో ఎవరికి స్థానం కల్పిస్తారు? ఆయన టీమ్‌లో ఎవరికి చోటు ఇస్తారు? టీమ్‌ ఎంపికతో ఎలాంటి సంకేతాలు పంపుతారు? అని అందరూ ఎదరు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో సోము వీర్రాజు కూడా తనదైన టీమ్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త కార్యవర్గంలో ప్రాంతాలు, సామాజికవర్గ సమీకరణాలు, బీజేపీతో దశాబ్దాల అనుబంధం ఉన్న నేతల్ని తీసుకునేందుకు సోము వీర్రాజు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే హైకమాండ్‌తో చర్చలు పూర్తి చేసినట్లు సమాచారం.

ఏపీలో నాలుగు ప్రాంతాల నుంచి నలుగురిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల ప్రకారం నలుగురు ప్రధాన కార్యదర్శులను తీసుకోవాలని సోము వీర్రాజు నిర్ణయించినట్లు సమాచారం. రాయలసీమ నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి, కోస్తా జిల్లాల నుంచి మాదిగ వర్గానికి చెందిన రావెల కిషోర్‌బాబు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి బీసీ అయిన పీవీఎన్‌ మాధవ్‌, గోదావరి జిల్లాల నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన తురగా నాగభూషణంలను ప్రధాన కార్యదర్శులుగా తీసుకుంటారు. వీరిలో ఒక్క రావెల తప్పించి మిగిలిన వారంతా దశాబ్దాలుగా బీజేపీ, దాని అనుబంధ సంస్థలు, సంఘాలలో కీలకంగా పనిచేసిన వారే.

ఈ కీలక నేతలతో పాటు మరో 10 మంది ఉపాధ్యక్షులు, మరో పది మంది కార్యదర్శులు, ఒక కోశాధికారిని నియమిస్తారట. కింది స్థాయి పదవుల్లో తన వారినే ఎక్కువ మందిని నియమించుకునేందుకు వీర్రాజు పావులు కదుపుతున్నారట. ఇటు మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణను కేంద్ర కార్యవర్గంలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి నిజమైన బీజేపీ నేతలకే ఈసారి పదవులు దక్కుతాయని కమలదళంలో ప్రచారం జరుగుతోంది.

Advertisement

Similar News