మరో నేతపై వేటేసిన సోమువీర్రాజు

ఏపీ బీజేపీలో ప్రక్షాళన కొనసాగుతోంది. పార్టీ సిద్ధాంతాలకు మ్యాచ్‌ కాని నేతలను పార్టీ నుంచి బయటకు పంపించివేస్తున్నారు. ఇప్పటికే పార్టీ లైన్‌ను ధిక్కరించిన ఓవీ రమణ, వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ నుంచి వచ్చిన లంక దినకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా గుడివాక రామాంజనేయులుపై వేటు పడింది. ఇతడు మొన్నటి ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మచిలీపట్నం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రామాంజనేయులు మద్యం అక్రమ రవాణా […]

Advertisement
Update:2020-08-17 02:56 IST

ఏపీ బీజేపీలో ప్రక్షాళన కొనసాగుతోంది. పార్టీ సిద్ధాంతాలకు మ్యాచ్‌ కాని నేతలను పార్టీ నుంచి బయటకు పంపించివేస్తున్నారు. ఇప్పటికే పార్టీ లైన్‌ను ధిక్కరించిన ఓవీ రమణ, వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

టీడీపీ నుంచి వచ్చిన లంక దినకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా గుడివాక రామాంజనేయులుపై వేటు పడింది. ఇతడు మొన్నటి ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మచిలీపట్నం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

రామాంజనేయులు మద్యం అక్రమ రవాణా బిజినెస్ చేస్తూ ఏపీ పోలీసులకు ఆదివారం పట్టుపడ్డారు. ఏపీలో మద్యం నియంత్రణ చర్యలు కఠినంగా ఉండడంతో తెలంగాణ నుంచి చౌక మద్యం తెచ్చి విక్రయించేందుకు రామాంజనేయులు ప్రయత్నించారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా గుంటూరు పోలీసులు పట్టుకున్నారు.

ఈ విషయం తెలియగానే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్రంగా స్పందించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రామాంజనేయుల్ని బీజేపీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News