యూరప్ వెళ్లొచ్చాక సుశాంత్ మారిపోయాడు !

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో కలిసి యూరప్ వెళ్లి వచ్చాక చాలా మారిపోయాడని, అతనిలో ఊహించలేనంత మార్పు కనిపించిందని… అతనికి సహాయకులుగా పనిచేసినవారు చెబుతున్నారు. సుశాంత్ సింగ్ కి సన్నిహితంగా మెలిగినవారు అందరూ  పోలీసుల విచారణలో ఇదే విషయం వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్య కేసుపై సిబిఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబరు మొదటివారంలో సుశాంత్, రియా ఇరువురు యూరప్ వెళ్లి… అదే నెల 28న తిరిగి […]

Advertisement
Update:2020-08-14 02:55 IST

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో కలిసి యూరప్ వెళ్లి వచ్చాక చాలా మారిపోయాడని, అతనిలో ఊహించలేనంత మార్పు కనిపించిందని… అతనికి సహాయకులుగా పనిచేసినవారు చెబుతున్నారు. సుశాంత్ సింగ్ కి సన్నిహితంగా మెలిగినవారు అందరూ పోలీసుల విచారణలో ఇదే విషయం వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్య కేసుపై సిబిఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది అక్టోబరు మొదటివారంలో సుశాంత్, రియా ఇరువురు యూరప్ వెళ్లి… అదే నెల 28న తిరిగి వచ్చారు. యూరప్ నుండి వచ్చిన తరువాత… తను డెంగ్యూతో బాధపడ్డానని అందుకే బయటకు రావటం లేదని సుశాంత్ అన్నట్టుగా తెలుస్తోంది. సుశాంత్ కి డిప్రెషన్ ఉందంటే తాను నమ్మలేనని అతని వంటమనిషి అశోక్ కుమార్ ఖాసు తాజాగా ఒక ప్రముఖ వార్తా సంస్థకు తెలిపాడు.

అశోక్ తో పాటు సుశాంత్ కేర్ టేకర్ గా ఉన్న నీరజ్, సుశాంత్ కి శిక్షకుడిగా ఉన్న మరొక వ్యక్తి… అందరూ యూరప్ ట్రిప్ తరువాత అతనిలో మార్పు వచ్చిందనే అంటున్నారు. యూరప్ ట్రిప్ కి తాను వెళ్లలేదని, సుశాంత్ కేర్ టేకర్ నీరజ్, రియా నియమించిన కొత్త వంటమనిషి కేశవ్ వెళ్లారని, వారిద్దరూ కూడా తనతో … సార్ చాలా మారిపోయారు… ఇకపై ఆయన ఇంతకుముందులా ఆనందంగా ఉండేమనిషికాదని…అన్నారని అశోక్ తెలిపాడు.

అంతేకాదు… సుశాంత్ తన చెల్లెళ్లతో కూడా మాట్లాడేందుకు ఇష్టపడలేదని, అక్కాచెల్లెళ్ల పట్ల అంత ప్రేమగా ఉండేమనిషి… వారు… నిన్ను చూడాలని ఉందని ప్రాధేయ పడుతూ మెసేజ్ చేసినా… ఇప్పుడు కలవలేను… పని ఉందని చెప్పాడని అశోక్ వెల్లడించాడు. అప్పుడు సుశాంత్ ఖాళీగానే ఉన్నాడని అతను చెప్పాడు.

ముంబయి, బీహార్ పోలీసులతో ఈ విషయాలన్నీ చెప్పానని అశోక్ తెలిపాడు. మూడేళ్లపాటు అతనికి నీడలా పనిచేశానని, ఏనాడూ సుశాంత్ లో డిప్రెషన్ అనేది మచ్చుకైనా కనిపించలేదని… కచ్ఛితంగా ఏదో ఊహించలేనిది జరిగిందని… అశోక్ అంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News