టీడీపీ కరోనా రాజకీయం..

రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే రికవరీ రేటు కూడా బాగుంది. మరణాల రేటులో జాతీయ సగటుకంటే.. రాష్ట్ర సగటు చాలా తక్కువ. జాతీయ స్థాయిలో మరణాల సగటు 1.96గా ఉంటే.. రాష్ట్రంలో 0.90గా ఉంది. అంటే వందమంది కరోనా రోగుల్లో 99శాతానికి పైగా కోలుకుని ఇంటికి వెళ్తున్నారు. అయితే టీడీపీ మాత్రం కరోనా విషయంలో నానా హంగామా చేస్తోంది. కేసులు తక్కువగా ఉన్నప్పుడు టెస్ట్ లు తక్కువ చేశారన్నారు, టెస్ట్ లు పెంచిన తర్వాత […]

Advertisement
Update:2020-08-14 03:01 IST

రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే రికవరీ రేటు కూడా బాగుంది. మరణాల రేటులో జాతీయ సగటుకంటే.. రాష్ట్ర సగటు చాలా తక్కువ. జాతీయ స్థాయిలో మరణాల సగటు 1.96గా ఉంటే.. రాష్ట్రంలో 0.90గా ఉంది. అంటే వందమంది కరోనా రోగుల్లో 99శాతానికి పైగా కోలుకుని ఇంటికి వెళ్తున్నారు.

అయితే టీడీపీ మాత్రం కరోనా విషయంలో నానా హంగామా చేస్తోంది. కేసులు తక్కువగా ఉన్నప్పుడు టెస్ట్ లు తక్కువ చేశారన్నారు, టెస్ట్ లు పెంచిన తర్వాత కేసుల సంఖ్యకూడా పెరిగితే.. ఇప్పుడు కేసులెక్కువయ్యాయని విమర్శిస్తున్నారు. మరణాల రేటు తక్కువగా ఉంది కదా అని ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే, పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నాయి కదా అని మరో లెక్క బైటకు తీస్తారు. ఎలాగోలా కరోనా పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక్కటే టీడీపీ చేస్తున్న పని.

ఈమధ్య అమరావతి చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రబాబు కరోనాని కాస్త పక్కన పెట్టారు. అయితే మళ్లీ చినబాబు ఇప్పుడు కరోనా లెక్కలు బైటకు తీస్తున్నారు. ఆఖరికి అచ్చెన్నాయుడుకు కరోనా వైరస్ సోకడాన్ని కూడా టీడీపీ రాజకీయం చేయాలనుకోవడం మరింత దారుణం. ఆరోగ్యం బాగాలేని, ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడిపై ప్రతీకారం కోసమే జగన్ కేసులు పెట్టించారని, ఆ కారణంగానే ఆయనకిప్పుడు కరోనా సోకిందని పరోక్షంగా ట్విట్టర్లో మండిపడ్డారు లోకేష్. జగన్ వల్లే అచ్చెన్న కరోనాబారిన పడ్డారనే అర్థం వచ్చేలా విమర్శించారు.

అచ్చెన్నకు కరోనా సోకిందని తెలియజేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్ట్ చేసిన ట్వీట్ లో జగన్ ప్రస్తావన ఎందుకు? ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో అచ్చెన్నాయుడు రిమాండ్ ఖైదీ. ఆయన జైలులో ఉండాల్సిన వ్యక్తి. అయితే అనారోగ్య కారణాలను సాకుగా చూపించి ఆస్పత్రిలో కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలో ఆయనకి ఎలాగో కరోనా సోకింది. దీనికి, జగన్ కి సంబంధం ఏంటి? జగన్ ప్రతీకార చర్యతోనే అచ్చెన్నకు కరోనా సోకిందంటూ టీడీపీ నాయకులు విలవిల్లాడిపోతున్నారు.

విజయవాడ ఫైర్ యాక్సిడెంట్ తో సంచలనంగా మారిన రమేష్ ఆస్పత్రిలోనే ప్రస్తుతం అచ్చెన్నకు ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వంపై నిందలేస్తున్న చంద్రబాబు, లోకేష్.. ఆఖరికి టీడీపీ నేతలు కరోనా బారిన పడినా జగనే కారణమంటూ వితండవాదం చేస్తున్నారు. టీడీపీ పతనావస్థలో ఈ కరోనా రాజకీయాలే ఆఖరు మెట్టుగా కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News