మాకొద్దు ఆ సొమ్ము " హైకోర్టు తీర్పుపై ఉద్యోగులు

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో ఆదాయం పూర్తిగా పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 50శాతం జీతం మాత్రమే చెల్లించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన ఆ సగం జీతాలను వెంటనే చెల్లించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. అది కూడా 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ ప్రకటించింది. సైనికులు కూడా కరోనా […]

Advertisement
Update:2020-08-14 04:39 IST

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో ఆదాయం పూర్తిగా పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 50శాతం జీతం మాత్రమే చెల్లించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన ఆ సగం జీతాలను వెంటనే చెల్లించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. అది కూడా 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ ప్రకటించింది. సైనికులు కూడా కరోనా సమయంలో తమ జీతంలో 11 రోజుల జీతాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ జీతంలో కొంతభాగాన్ని కరోనా సాయం కోసం ఇచ్చారని… అలాంటిది తాము కరోనా సమయంలో పనిచేసినా చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంటే.. ఇబ్బందుల కారణంగా వాయిదా వేసిన 50 శాతం జీతానికి 12 శాతం వడ్డీ ఎలా తీసుకోగలము? అని ఉద్యోగ సంఘం ప్రశ్నించింది.

విపత్తు సమయంలో 12 శాతం వడ్డీతో జీతం తీసుకుంటే ప్రజల్లో ఉద్యోగుల వ్యక్తిత్వాలపై చిన్నచూపు కలిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాలు కూడా జీతాల్లో కోత పెట్టడమో లేక వాయిదా వేయడమో చేశాయని ఎంప్లాయిస్ ఫెడరేషన్ తన ప్రకటనలో వివరించింది. లాక్‌డౌన్ సమయంలో దాదాపు రెండు నెలలు తాము ఆఫీసులకు వెళ్లకపోయినా ప్రభుత్వం జీతాలు చెల్లించిందని గుర్తు చేసింది.

కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం, ప్రజలతో కలిసి ప్రభుత్వ ఉద్యోగులు నడవాలనుకుంటున్నారని… తమ చేతనైనంత మేరకు ప్రజలకు, ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉండాలనుకుంటున్నామని ఫెడరేషన్ వివరించింది. 12 శాతం వడ్డీతో జీతం తీసుకునే ఆలోచన తమకు లేదని వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News