అయోధ్యలో భూమి పూజ... ఆనందంలో రావణ గుడి పూజారి !

అయోధ్యలో శ్రీరాముని గుడికి భూమిపూజ కార్యక్రమం జరిగిన వెంటనే తాను అందరికీ స్వీట్లు పంచుతానంటున్నాడు రావణుని నిత్యం కొలిచే ఓ పూజారి. రామునికి విరోధి అయిన రావణుని పూజించే  వ్యక్తి అలా అనటం విచిత్రంగానే అనిపిస్తున్నా… అందుకు తగిన కారణాలున్నాయంటున్నాడాయన. అయోధ్యకు దాదాపు 650 కిలోమీటర్ల దూరంలో  గౌతమ్ బుద్ద నగర్ జిల్లాలోని బిస్ రాక్ (గ్రేటర్ నోయిడాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం) ప్రాంతంలో ఈ రావణుని గుడి ఉంది. బాస్ రాక్ ని […]

Advertisement
Update:2020-08-04 15:36 IST

అయోధ్యలో శ్రీరాముని గుడికి భూమిపూజ కార్యక్రమం జరిగిన వెంటనే తాను అందరికీ స్వీట్లు పంచుతానంటున్నాడు రావణుని నిత్యం కొలిచే ఓ పూజారి. రామునికి విరోధి అయిన రావణుని పూజించే వ్యక్తి అలా అనటం విచిత్రంగానే అనిపిస్తున్నా… అందుకు తగిన కారణాలున్నాయంటున్నాడాయన.

అయోధ్యకు దాదాపు 650 కిలోమీటర్ల దూరంలో గౌతమ్ బుద్ద నగర్ జిల్లాలోని బిస్ రాక్ (గ్రేటర్ నోయిడాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం) ప్రాంతంలో ఈ రావణుని గుడి ఉంది. బాస్ రాక్ ని రావణ జన్మభూమిగా చెబుతారు. మహంత్ రామదాస్ రావణ గుడి పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన అయోధ్యలో రాయాలయం భూమి పూజ పట్ల తన హర్షం వ్యక్తం చేస్తూ అందుకు కారణాలు వివరించాడు.

‘అయోధ్యలో భూమి పూజ జరుగుతున్నందుకు, అక్కడ గొప్ప ఆలయ నిర్మాణం జరగబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రావణుడు లేనిదే ఎవరికీ రాముడి గురించి తెలియదు… అలాగే రాముడు లేకపోతే రావణుడి గురించి కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు’ అంటాడు రామదాస్. రావణుడు గొప్ప జ్ఞానవంతుడు….ఎన్నో కళల్లో నిష్ణాతుడు…అని చెబుతూ…సీతను అపహరించుకుని పోయాక తన భవనానికి తీసుకుని వెళ్లకుండా అశోక వనంలో ఉంచాడని, అలాగే ఆమెకు కాపలాగా స్త్రీలనే ఉంచాడని, రాముడు ఎన్నో గొప్ప గుణాలున్న సుగుణాభిరాముడు అయితే…. రావణుడు సైతం కొన్ని విషయాల్లో చాలా మంచి లక్షణాలున్నవాడని అంటున్నాడు రామదాస్.

బిస్ రాక్ లో రావణుని గుడిలో శివపార్వతులు, కుబేరుల విగ్రహాలు సైతం ఉంటాయి. శివపార్వతులు, కుబేరులతో పాటు భక్తులు రావణునికి కూడా పూజలు చేస్తుంటారని, భక్తుల్లో 20శాతం మంది వరకు రావణుని ఆరాధకులు ఉంటారని మహంత్ రామదాస్ వివరించాడు.

Tags:    
Advertisement

Similar News