రోగి డాక్టర్‌కు డెడ్‌లైన్‌ పెట్టినట్టుగా బాబు డెడ్‌లైన్‌ ఉంది...

మూడు రాజధానుల అంశంపై దమ్ముంటే జగన్‌మోహన్ రెడ్డి 48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్దం కావాలన్న చంద్రబాబు సవాల్‌ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన డెడ్‌లైన్ చూస్తుంటే… నేరగాడు పోలీసులకి, రోగి డాక్టర్‌కు డెడ్‌లైన్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉందని వ్యాఖ్యానించారు. ఘన విజయం సాధించిన ప్రజా ప్రభుత్వానికి… చిత్తుగా ఓడిన చంద్రబాబు డెడ్‌లైన్ ఇవ్వడం డాక్టర్‌కు రోగి డెడ్‌లైన్ పెట్టినట్టుగానే ఉందన్నారు. డెడ్‌ పార్టీ, డెడ్‌ లీడర్ […]

Advertisement
Update:2020-08-04 11:20 IST

మూడు రాజధానుల అంశంపై దమ్ముంటే జగన్‌మోహన్ రెడ్డి 48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్దం కావాలన్న చంద్రబాబు సవాల్‌ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన డెడ్‌లైన్ చూస్తుంటే… నేరగాడు పోలీసులకి, రోగి డాక్టర్‌కు డెడ్‌లైన్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉందని వ్యాఖ్యానించారు.

ఘన విజయం సాధించిన ప్రజా ప్రభుత్వానికి… చిత్తుగా ఓడిన చంద్రబాబు డెడ్‌లైన్ ఇవ్వడం డాక్టర్‌కు రోగి డెడ్‌లైన్ పెట్టినట్టుగానే ఉందన్నారు. డెడ్‌ పార్టీ, డెడ్‌ లీడర్ షిప్‌ అరిచే అరుపుల్ని డెడ్‌లైన్‌ అంటారా నారా వారూ! అని ఎద్దేవా చేశారు.

రాజధాని విషయంలో చంద్రబాబు నవ్వుతున్నాడో, మొహం కందగడ్డలా పెట్టుకన్నాడో, కుట్ర చేస్తున్నాడో , ఏడుస్తున్నాడో తెలుసుకోవాలంటే నేరుగా ఆయన ముఖం చూడాల్సిన పనిలేదని… ఎల్లో మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు చూస్తే సరిపోతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News