ప్రముఖులపై కరోనా దాడి

దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ను నిర్మూలించడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి ప్రభుత్వాలు దాదాపుగా వచ్చేశాయి. కేవలం వైరస్‌ బారిన పడిన వారికి వైద్యం అందించి మరణాలు తగ్గించేందుకే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దేశంలో ప్రముఖులపైనా వైరస్‌ దాడి చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనాతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీకి అమిత్ షా హాజరయ్యారు. ఇప్పుడాయనకు వైరస్‌ సోకడంతో మిగిలిన కేంద్ర మంత్రులు, ముఖ్యులు పరీక్షలు చేయించుకునే […]

Advertisement
Update:2020-08-03 02:49 IST

దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ను నిర్మూలించడం సాధ్యం కాదన్న అభిప్రాయానికి ప్రభుత్వాలు దాదాపుగా వచ్చేశాయి. కేవలం వైరస్‌ బారిన పడిన వారికి వైద్యం అందించి మరణాలు తగ్గించేందుకే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దేశంలో ప్రముఖులపైనా వైరస్‌ దాడి చేస్తోంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనాతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీకి అమిత్ షా హాజరయ్యారు. ఇప్పుడాయనకు వైరస్‌ సోకడంతో మిగిలిన కేంద్ర మంత్రులు, ముఖ్యులు పరీక్షలు చేయించుకునే పనిలో ఉన్నారు. అమిత్ షాకు వైద్యం అందించేందుకు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

కర్నాటక సీఎం యడ్యూరప్పను కరోనా తాకింది. దేశంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి తర్వాత కరోనా బారిన పడ్డ రెండో సీఎం యడ్యూరప్పే. తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్ పురోహిత్‌ కరోనా బారినపడ్డారు. గవర్నర్ వయసు 80ఏళ్లు కావడంతో వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో మొత్తం 90 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు.

యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌లో విద్యా శాఖమంత్రిగా ఉన్న కమలారాణి కరోనాతో చనిపోయారు. ఆమె వయసు 62ఏళ్లు. యూపీలో మరో మంత్రి కూడా కరోనా బారినపడ్డారు. యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్‌కు వైరస్ సోకింది. ఆదివారం ఒక్కరోజే దేశంలో 853 మంది కరోనాతో చనిపోయారు.

Tags:    
Advertisement

Similar News