త్వరలోనే పరిపాలన రాజధానికి సీఎం శంకుస్థాపన
మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. మండలిలో సంఖ్యాబలాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం చేసేందుకు టీడీపీ ప్రయత్నించిందన్నారు. మండలిలో టీడీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తించారన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే విజయం సాధించిందన్నారు. ఒక మంచి ముహూర్తం చూసుకుని విశాఖలో పరిపాలన రాజధాని కోసం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు. త్వరలోనే విశాఖ వేదికగా పరిపాలన రాజధాని ప్రారంభమవుతుందన్నారు. […]
మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు.
మండలిలో సంఖ్యాబలాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం చేసేందుకు టీడీపీ ప్రయత్నించిందన్నారు. మండలిలో టీడీపీ నేతలు రౌడీల్లా ప్రవర్తించారన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే విజయం సాధించిందన్నారు.
ఒక మంచి ముహూర్తం చూసుకుని విశాఖలో పరిపాలన రాజధాని కోసం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు. త్వరలోనే విశాఖ వేదికగా పరిపాలన రాజధాని ప్రారంభమవుతుందన్నారు.
వికేంద్రీకరణతో 13 జిల్లాలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అమరావతి కూడా ఒక భాగమని… ఆ ప్రాంత అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామన్నారు.