ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ.... అర్ధరాత్రి ఉత్తర్వులు !

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్‌ పేరిట పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నియమిస్తున్నట్లు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మరోవైపు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ గురించి కూడా నోటిఫికేషన్‌లో ప్రస్తావించారు. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి […]

Advertisement
Update:2020-07-31 02:35 IST

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్‌ పేరిట పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నియమిస్తున్నట్లు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

మరోవైపు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ గురించి కూడా నోటిఫికేషన్‌లో ప్రస్తావించారు. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని ఉత్తర్వులో స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌నే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

Tags:    
Advertisement

Similar News