టీడీపీ ఓటు బ్యాంకే లాక్కుంటాం " సోము వీర్రాజు
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాము టీడీపీ ఓటు బ్యాంకునే లాక్కుంటామని వ్యాఖ్యానించారు. 1998లో బీజేపీకి ఏపీలో ఒంటరిగానే 18 శాతం ఓట్లు రావడంతో మేలుకున్న చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని వివరించారు. అలా 1998లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 2004కు వచ్చే సరికి బీజేపీ ఓటు బ్యాంకును మొత్తం చంద్రబాబు ఏపీలో కొల్లగొట్టారని సోము వీర్రాజు విమర్శించారు. 2014లో మరోసారి పొత్తు పెట్టుకుని 2019నాటికి బీజేపీని నాశనం చేశారన్నారు. […]
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాము టీడీపీ ఓటు బ్యాంకునే లాక్కుంటామని వ్యాఖ్యానించారు.
1998లో బీజేపీకి ఏపీలో ఒంటరిగానే 18 శాతం ఓట్లు రావడంతో మేలుకున్న చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని వివరించారు. అలా 1998లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 2004కు వచ్చే సరికి బీజేపీ ఓటు బ్యాంకును మొత్తం చంద్రబాబు ఏపీలో కొల్లగొట్టారని సోము వీర్రాజు విమర్శించారు. 2014లో మరోసారి పొత్తు పెట్టుకుని 2019నాటికి బీజేపీని నాశనం చేశారన్నారు.
టీడీపీ ఓటు బ్యాంకు యాంటి కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాబట్టి సహజంగానే దాన్ని తాము తీసుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. వికేంద్రీకరణే బీజేపీ విధానమని వెల్లడించారు.
మూడు రాజధానులే అని కాకుండా ప్రతి జిల్లాను ఒక రాజధాని తరహాలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం హైదరాబాద్‌లో పెట్టడం ద్వారా 13 జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.