తెలంగాణలో ప్రైవేట్ దోపిడి... కరోనాకు పది రోజులకు 17. 5లక్షల బిల్లు
ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడి ఆగడం లేదు. రోజుకు లక్షల చొప్పున బిల్లు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న డెక్కన్ ఆస్పత్రి కరోనా వైద్యానికి పది రోజులకు 17లక్షల 50వేలు బిల్లు చేసింది. సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే 8లక్షల రూపాయలు బిల్లు చెల్లించారు. చికిత్స పొందుతూ సత్యనారాయణరెడ్డి ఉదయం చనిపోయాడు. ఫైనల్ బిల్లు చూడగా ఏకంగా 17 లక్షల 50వేలు వేశారు. దాంతో […]
ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడి ఆగడం లేదు. రోజుకు లక్షల చొప్పున బిల్లు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న డెక్కన్ ఆస్పత్రి కరోనా వైద్యానికి పది రోజులకు 17లక్షల 50వేలు బిల్లు చేసింది.
సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే 8లక్షల రూపాయలు బిల్లు చెల్లించారు. చికిత్స పొందుతూ సత్యనారాయణరెడ్డి ఉదయం చనిపోయాడు. ఫైనల్ బిల్లు చూడగా ఏకంగా 17 లక్షల 50వేలు వేశారు. దాంతో కుటుంబసభ్యులు కంగుతిన్నారు.
ఇటీవలే సత్యనారాయణ రెడ్డి భార్య కూడా కరోనాతో మృతి చెందారు. మూడు రోజుల క్రితం సత్యనారాయణ రెడ్డి అన్న కుమారుడు కూడా కరోనాతో చనిపోయాడు. దాంతో తీవ్ర మనోవేధనతో సత్యనారాయణ రెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయారు.
డబ్బు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామన్న ఆస్పత్రి చివరకు చర్చల అనంతరం పేమెంట్ తగ్గించుకుని కట్టించుకుని మృతదేహాన్ని అప్పగించింది. కరోనాకు ఎలాంటి ప్రత్యేక వైద్యం లేదు. పరిస్థితి చేయి దాటినప్పుడు కేవలం వెంటిలేటర్ మాత్రమే ఉపయోగిస్తుంటారు. అలాంటప్పుడు రోజుకు లక్షల్లో బిల్లు వేయడంపై ప్రజలు తెలంగాణలో హడలిపోతున్నారు.