సంచయితకు కేంద్రం అభినందనలు

కేంద్ర ప్రభుత్వం సింహాచలం ఆలయాన్ని ప్రసాద్‌ పథకంలో చేర్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సింహాచలం ఆలయ చైర్‌పర్సన్‌గా ఉన్న సంచయితను అభినందించింది. నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్‌ డ్రైవ్‌- ప్రసాద్‌ అనే పథకం కింద దేశంలో ఐదు ఆలయాలకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ ఐదు ఆలయాల్లో 11వ శతబ్దానికి చెందిన సింహాచలం ఆలయం కూడా ఉంది. […]

Advertisement
Update:2020-07-29 15:32 IST

కేంద్ర ప్రభుత్వం సింహాచలం ఆలయాన్ని ప్రసాద్‌ పథకంలో చేర్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సింహాచలం ఆలయ చైర్‌పర్సన్‌గా ఉన్న సంచయితను అభినందించింది.

నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్‌ డ్రైవ్‌- ప్రసాద్‌ అనే పథకం కింద దేశంలో ఐదు ఆలయాలకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ ఐదు ఆలయాల్లో 11వ శతబ్దానికి చెందిన సింహాచలం ఆలయం కూడా ఉంది.

దేశంలో ముఖ్య‌మైన ప‌ర్యాట‌క‌, ఆధ్యాత్మిక‌, ధార్మిక ప్ర‌దేశాలు అభివృద్ది చేసేందుకు కేంద్రం “ప్ర‌సాద్‌” ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ పథకం కింద పర్యాటన ప్రదేశాలను, ఆధ్మాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులు ఇస్తుంది. ఈ పథకంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ నుంచి తిరుమల, శ్రీశైలం ఎంపిక చేయబడ్డాయి. మూడో ఆలయంగా సింహాచలం అప్పన్న ఆలయం ప్రసాద్ పథకంలో చేరింది.

సింహాచలం ఆలయాన్ని ప్రసాద్‌ పథకం కింద ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌కు సంచయిత కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News