ప్రధాన కార్యదర్శి పదవీకాలం పెంపుపై సీఎం జగన్ ప్రయత్నాలు?

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని సీఎం వైఎస్ జగన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సాహ్ని పదవీకాలం జూన్ 30కే ముగిసింది. అయితే గతంలో ఆరు నెలల పెంపు కోరగా మూడు నెలలతో కేంద్రం సరిపెట్టింది. దీంతో ఆమెకు ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30కి పూర్తికానుంది. కాగా, ప్రస్తుతం కోవిడ్-19పై ఎనలేని పోరాటం చేస్తున్న ఏపీ ప్రభుత్వంలో నీలం […]

Advertisement
Update:2020-07-29 05:07 IST

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని సీఎం వైఎస్ జగన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సాహ్ని పదవీకాలం జూన్ 30కే ముగిసింది. అయితే గతంలో ఆరు నెలల పెంపు కోరగా మూడు నెలలతో కేంద్రం సరిపెట్టింది. దీంతో ఆమెకు ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30కి పూర్తికానుంది.

కాగా, ప్రస్తుతం కోవిడ్-19పై ఎనలేని పోరాటం చేస్తున్న ఏపీ ప్రభుత్వంలో నీలం సాహ్నీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొత్త సీఎస్‌ను నియమించడం ద్వారా కోవిడ్-19 నియంత్రణ చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుందని సీఎం భావిస్తున్నారు. ప్రస్తుతం సీఎంవో టీంతో సీఎస్ సాహ్ని, డీజీపీ సవాంగ్‌ల మధ్య మంచి కమ్యునికేషన్ ఉందని… వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, రోగుల వైద్యం తదితర అంశాలు ఈ టీం వల్ల మంచిగా సక్సెస్ అవుతున్నట్లు సీఎం గ్రహించారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో కూడా నీలం సాహ్ని చొరవతీసుకొని కీలకంగా వ్యవహరించడం, ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఏర్పడిన ఆటంకాలను తొలగించడంలో సాహ్ని చాకచక్యంగా వ్యవహరించడంతో సీఎం జగన్ ఆమెకు మరికొంత కాలం పొడగింపు ఉంటే మంచిదనే భావనలో ఉన్నారు. కొత్త సీఎస్ అయితే పాలనా విధానాలకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో దాని వల్ల ప్రభుత్వానికి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

గతంలోనే సీఎస్ నీలం సాహ్నికి ఈ ఏడాది చివరి వరకు పొడగింపు కోరారు. కానీ కేంద్రం మాత్రం మూడు నెలల పొడగింపుతో సరిపెట్టింది. మరి ఇప్పుడు మరో ఆరు నెలల పొడగింపు కోరుతుండటంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది.

Tags:    
Advertisement

Similar News