శానిటైజర్ పెన్... టైతో మ్యాచయ్యే మాస్క్!

సమాజంలో ఏ భిన్నత్వం కనిపించినా వెంటనే తదనుగుణంగా స్పందిస్తుంది మార్కెట్. అలాగే ఇప్పుడు కరోనా కాలంలో కూడా… భిన్నమైన మాస్కులు, శానిటైజర్లు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. లక్నోలో వెరైటీగా శానిటైజర్ పెన్ ని రూపొందించారు. అంటే ఈ పెన్నుతో రాసుకోవచ్చు… చేతులను శానిటైజ్ కూడా చేసుకోవచ్చన్నమాట. ‘ఇంతకు ముందు శానిటైజర్లను ఎవరూవాడేవారు కాదు… ఇప్పుడది నిత్యావసరంగా మారింది. వినియోగదారుల అభిరుచులు అవసరాలు భిన్నంగా ఉంటాయి. వారందరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వస్తువులను తయారుచేయాల్సి ఉంటుంది. అందుకే మేము శానిటైజర్ […]

Advertisement
Update:2020-07-27 04:34 IST

సమాజంలో ఏ భిన్నత్వం కనిపించినా వెంటనే తదనుగుణంగా స్పందిస్తుంది మార్కెట్. అలాగే ఇప్పుడు కరోనా కాలంలో కూడా… భిన్నమైన మాస్కులు, శానిటైజర్లు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. లక్నోలో వెరైటీగా శానిటైజర్ పెన్ ని రూపొందించారు. అంటే ఈ పెన్నుతో రాసుకోవచ్చు… చేతులను శానిటైజ్ కూడా చేసుకోవచ్చన్నమాట.

‘ఇంతకు ముందు శానిటైజర్లను ఎవరూవాడేవారు కాదు… ఇప్పుడది నిత్యావసరంగా మారింది. వినియోగదారుల అభిరుచులు అవసరాలు భిన్నంగా ఉంటాయి. వారందరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వస్తువులను తయారుచేయాల్సి ఉంటుంది. అందుకే మేము శానిటైజర్ పెన్నులను రూపొందించాం. ఇవి విద్యార్థులకు ఆఫీసులకు వెళ్లేవారికి బాగా పనిచేస్తాయి. వీటితో రాసుకోవచ్చు…. చేతులను శుభ్రం చేసుకోవచ్చు’ అంటున్నారు దీని తయారీదారులు.

మరిన్ని భిన్నమైన శానిటైజర్లను వీటి ఉత్పత్తి దారులు మార్కెట్లోకి తెస్తున్నారు. యాభై మిల్లీ లీటర్ల నుండి ఐదు లీటర్ల పరిమాణం వరకు శానిటైజర్లు అందుబాటులో ఉంటున్నాయి. కొన్నయితే జెల్ రూపంలో వస్తున్నాయి. అలాగే కరెన్సీ నోట్లను శుభ్రం చేసేందుకు స్ప్రే రూపంలో సైతం శానిటైజర్ అందుబాటులో ఉంది. కారు తాళాలు శుభ్రం చేసేందుకు ప్రత్యేకమైన శానిటైజర్లు ఉన్నాయి. ఇంకా గదులను, గార్డెన్ ప్రాంతాలను శుభ్రం చేయడానికి ఫాగింగ్ మెషిన్లు సైతం లభ్యమవుతున్నాయి.

శానిటైజర్లే కాదు…. మాస్కులు సైతం రకరకాల అందమైన డిజైన్లలో భిన్నంగా వస్తున్నాయి. మగవారు మెడకు కట్టుకునే టైకి మ్యాచ్ అయ్యేలా…. మాస్క్, టైలను సెట్ గా అమ్ముతున్నాయి. పెళ్లికొడుకు పెళ్లికూతుళ్లకోసమంటూ మరింత ప్రత్యేకమైన, ఖరీదైన మాస్కులు సైతం మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News