కరోనా పాజిటివ్స్‌ కనిపించడం లేదు... అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి‌ !

బెంగళూరు , హైదరాబాద్‌, విజయవాడ… నగరం ఏదైనా ఇప్పుడు ఒకటే జరుగుతోంది. కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు… పాజిటివ్‌ వస్తే ఫోన్‌ చేస్తే ఫోన్లు ఎత్తడం లేదు. మరికొందరు స్విచాఫ్‌ చేస్తున్నారు. ఇంకొందరు పాజిటివ్‌ అని తెలిసి కనిపించకుండా పోతున్నారు. బెంగళూరులో 3,388 మంది కరోనా పాజిటివ్‌ బాధితులు కనిపించడం లేదు. వారు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. వీరంతా పాజిటివ్‌ వచ్చినవారు. టెస్టు చేయించుకునే సమయంలో అడ్రస్, ఫోన్ నెంబర్‌ తప్పుగా ఇచ్చారు. వీరు హోం ఐసోలేషన్ […]

Advertisement
Update:2020-07-26 04:28 IST

బెంగళూరు , హైదరాబాద్‌, విజయవాడ… నగరం ఏదైనా ఇప్పుడు ఒకటే జరుగుతోంది. కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు… పాజిటివ్‌ వస్తే ఫోన్‌ చేస్తే ఫోన్లు ఎత్తడం లేదు. మరికొందరు స్విచాఫ్‌ చేస్తున్నారు. ఇంకొందరు పాజిటివ్‌ అని తెలిసి కనిపించకుండా పోతున్నారు.

బెంగళూరులో 3,388 మంది కరోనా పాజిటివ్‌ బాధితులు కనిపించడం లేదు. వారు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. వీరంతా పాజిటివ్‌ వచ్చినవారు. టెస్టు చేయించుకునే సమయంలో అడ్రస్, ఫోన్ నెంబర్‌ తప్పుగా ఇచ్చారు. వీరు హోం ఐసోలేషన్ లోనో‌ లేకపోతే క్వారంటైన్‌లోనో ఉంటే ఫర్వలేదు. కానీ వీళ్లు బయట తిరిగితే మాత్రం ప్రమాదం. వీరి ద్వారా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుంది. ఇప్పుడు ఇదే అంశం బెంగళూరు అధికారులను కలవరపెడుతోంది.

ఇటు హైదరాబాద్‌తో పాటు ఏపీలో పరీక్షలు చేయించుకున్న కొందరు… పాజిటివ్ అని తెలియగానే కనిపించకుండాపోయారు. వీరంతా ట్రేస్‌ కావడం లేదు. ఫోన్‌ నెంబర్లు, అడ్రస్ లు తప్పుగా ఇచ్చారు. దీంతో వీరిని వెతకడం కష్టమవుతోంది.

పాజిటివ్‌ వచ్చిన వారిలో చాలా మంది భయంతో వారి సమాచారం ఇవ్వడం లేదు. తమకు వైరస్‌ వచ్చిందని తెలిస్తే సమస్యలు వస్తాయని మరికొందరు భయపడుతున్నారట.

మొత్తానికి వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. ఈ టైమ్‌లో కరోనా బాధితులు కనిపించకుండాపోవడం కొత్త సమస్యలు తీసుకొస్తోంది. దీంతో ఇక నుంచి టెస్ట్‌ చేయించుకుంటున్న వ్యక్తి గుర్తింపు కార్డుతో పాటు ఫోన్‌ నెంబర్‌, సరైన అడ్రస్‌ తీసుకోవాలని నిర్ణయించారు.

అయితే ఇప్పటికే ఏపీలో ఆధార్ కార్డు లేక ఇతర గుర్తింపు కార్డుల సమాచారం తీసుకునే టెస్టులు చేస్తున్నారు. టెస్ట్ అనంతరం రిపోర్ట్ ను సదరు వ్యక్తి ఫోన్ నెంబర్ కు మెసెజ్ రూపంలో పంపిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ వస్తే వాలంటీర్ల, ఆశావర్కర్ల సహాయంతో సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను బట్టి క్వారంటైన్ కు గానీ… హోం ఐసోలేషన్ లోనో ఉంచుతున్నారు.

Tags:    
Advertisement

Similar News